మమతా బెనర్జీ తర్వాత ఈ బీజేపీ ఎంపీనే! | Family of Uri attack martyrs felt humiliated by UP BJP MP Sharad Tripathi.

Family of uri attack martyrs felt humiliated by up bjp mp sharad tripathi

Family of Uri attack martyrs felt humiliated by UP BJP MP, Uri attack martyrs Insult, Mamata Benarjee insult Uri martyrs, mamata banerjee Uri martyrs, BJP MP Sharad Tripathi Begging, BJP MP Sharad Tripathi Uri attack martyrs

Family of Uri attack martyrs felt humiliated by Uttara Pradesh BJP MP Sharad Tripathi. The family of Ganesh Shankar Yadav, who was martyred in the Uri terror attack, said they felt “humiliated” by BJP MP Sharad Tripathi’s appeal at the funeral to collect donations from the public to help them.

అమరవీరుల కోసం బిచ్చగాడిగా మారిన ఎంపీ

Posted: 09/23/2016 09:17 AM IST
Family of uri attack martyrs felt humiliated by up bjp mp sharad tripathi

యూరీ సెక్టార్ లో ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వీరజవానుల కుటుంబాలకు అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయి. 2 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు ఎదుర్కోగా, తాజాగా మరో నేత వ్యవహారంపై అంతా మండిపడుతున్నారు. బీజేపీ ఎంపీ చేసిన నిర్వాకంపై గ్రామస్థులే ఆగ్రహాం వ్యక్తం చేయగా, ఆ అమరుడి కుటుంబాన్ని తీవ్ర ఆవేదనకు గురైంది.

ఉత్తరప్రదేశ్‌ కు చెందిన జవాను గణేశ్‌ శంకర్‌ యాదవ్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో గణేశ్‌ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గురాపలిలో సైనిక లాంఛనాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా హాజరైన బీజేపీ ఎంపీ శరద్‌ త్రిపాఠి వీరజవాను మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వీరజవాను అంత్యక్రియలకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... గణేశ్‌ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతటితో ఆగని ఆయన ఎవరికి తోచినంత సాయం వారు చేయాలని హాజరైన వారిని కోరారు.

దీంతో పలువురు డబ్బులిచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే అప్పటికే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన అమరజవాను కుటుంబ సభ్యులను ఇది తీవ్రంగా బాధించింది. దీనిని అవమానంగా భావించిన అమర జవాను భార్య గడియా తామేమీ బిచ్చగాళ్లం కాదని మండిపడింది. సైనిక లాంఛనాలు, ఇతర సౌకర్యాలు ఉండగా, చందాలు వసూలు చేయడమేంటని, దయచేసి డబ్బులిచ్చి అవమానించవద్దని ఆమె ఆయనకు స్పష్టం చేశారు. ఆ హఠాత్ పరిణామంతో బిత్తరపోయిన సదరు బీజేపీ ఎంపీ తన అనుచరులతో అక్కడి నుంచి నిష్క్రమించారు.

కాగా, దీనిపై పలువురు స్థానికులు మండిపడుతున్నారు. ఎంపీగా సాయం చేయాల్సిన ఆయన అక్కడున్న వారి నుంచి చందాలు వసూలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలపై స్పందించిన త్రిపాఠి ఆ కుటుంబాన్ని అవమానించడం తన ఉద్దేశం కాదని, వారికి సాయం చేయాలని మాత్రమే చూశానని వివరణ ఇచ్చుకున్న అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Bengal  CM Mamata Benarjee  BJP MP Sharad Tripathi  insult  Uri attack martyrs  

Other Articles