కన్నకూతురిని కామంతో రేప్ చేశాడు... ఫలితం? | Man arrested for raping impregnating daughter in Kerala

Man arrested for raping impregnating daughter in kerala

Kerala man rape daughter, Man Rape daughter, Kerala Man Rape daughter and Pregnant, Daughter Pregnant by Father, Minor Daughter Raped by Father, Minor rape in India

A 48-year-old man was arrested today on charges of raping and impregnating his minor daughter at Vythiri here, police said.

కూతురి కడుపులో బిడ్డకు ‘తండ్రి’ ఎవరు?

Posted: 09/22/2016 12:51 PM IST
Man arrested for raping impregnating daughter in kerala

జుగుప్సాకరమైన వార్త ఇది. మానవ సంబంధాలు మంటగలిసిపోయాని మరోసారి రుజువు చేసింది. కంటికి రెప్పలా కూతురిని కాపాడాల్సిన తండ్రి, కామంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటమే కాదు,  మైనర్ అయిన ఆ బాలిక  గర్భవతి కావటానికి కారణమయ్యాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లిని కూడా చంపేస్తానని బెదిరించాడు . భయంతో ఆమె ఎవరికీ విషయం చెప్పుకోలేకపోయింది. అయితే బిడ్డ ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో లబోదిబోమంటూ గుండెలు బాదుకుంది.

కేరళలో చోటుచేసుకున్న ఘటన వివరాళ్లోకి వెళ్లితే..  వైతిరిలోని నివాసం ఉంటున్న 48 ఏళ్ల కామ పిశాచి 16 ఏళ్ల తన కూతురిపై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. తనను పాడుచెయొద్దని వేడుకుంటున్నా ఆ కిరాతకుడు కనికరించలేదు. దీంతో గర్భం దాల్చింది. ఆస్పత్రిలో అసలు విషయం బయటపడగా, తల్లి అక్కడికక్కడే కూలబడిపోయింది. ఆపై ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి భర్త చేసిన నీచపు పనిపై ఫిర్యాదు చేసింది.  

ఆ మృగాన్ని అరెస్టు చేసి, పొస్కో కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష పడాలంటూ మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala Man  Daughter  Rape  Pregnant  

Other Articles