రామ్ కుమార్ మృతదేహానికి 4 సభ్యుల వైద్యబృందంతో పోస్టుమార్టం 'Ramkumar had no suicidal tendencies'

High court orders postmortem of ram kumar s body

Chennai techie, Swathi, Madras High Court, Ramkumar, suicide, post mortem, autopsy team, four member team, Dr Balasubramanian, Dr S Selvakumar, Dr Manikandaraja, Dr K V Vinod, Justice T S Sivagnanam

Madras High Court ordered setting up of a four-member team of doctors to conduct the postmortem of the body of P Ram Kumar, accused in the woman techie murder case.

వీడని స్వాతీ హత్యకేసులో మిస్టరీ.. పోలీసుల మెడకు రామ్ కుమార్ ఉచ్చు

Posted: 09/20/2016 10:41 AM IST
High court orders postmortem of ram kumar s body

టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడి జైలులో ఆత్మహత్య పాల్పడిన ఘటన పోలీసు అధికారులతో మెడకు ఉచ్చుగా బిగుసుకుంటుంది.  రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని తండ్రి పరమశివం, సోదరులు పేర్కొంటుండగా, తమ బిడ్డను పోలీసులే హత్య చేసి, అత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కూడా వారు అరోఫిస్తున్నారు. స్వాతి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌కుమార్ జూన్ 24న నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో స్వాతిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన రామ్‌కుమార్ అసలైన నిందితుడు కాదనే వాదనలు తొలి నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అటు ప్రజా సంఘాలు, ప్రతిఫక్షాలు కూడా ప్రభుత్వంతో పాటు పోలీసు అధికారులపై అరోపణలు గుప్పిస్తున్నాయి. స్వాతి హత్య కేసులో రామ్ కుమార్ అసలు నేరస్థుడు కాదని, దీంతో ఎక్కడ నిజాలు వెలుగులోకి వస్తాయోనని పోలీసులే రామ్ కుమార్ ను హతమార్చాయని అరోపణలు వినబడుతున్నాయి. కాగా జైలులో ఉన్న నిందితుడు కరెంటు వైరును నోటితో కొరికి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు మరోమారు తెరపైకి వచ్చింది. జైలులో వేలాది మంది ఖైదీలు, గస్తీ సిబ్బంది ఉండగా రామ్‌కుమార్ కరెంటు వైర్లను కొరికి ఆత్మహత్య చేసుకోవడంపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రామ్‌కుమార్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాతే కుమారుడి మృతదేహాన్ని తీసుకుంటానని పరమశివం భీష్మించుకున్నారు. దీంతో ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించడంతో పోలీసులు ఇరుకున పడ్డారు. ప్రభుత్వానికి వారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు నిందితుడి మృతదేహానికి పోస్టుమార్టంపై స్టే విధించిన మద్రాసు హైకోర్టు.. ఆయన పోస్టుమార్టాన్ని నలుగురు సభ్యులు గల వైద్యబృందంతో నిర్వహించాలని అదేశించింది. దీనికి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యన్ నేతృత్వం వహించనుండగా, వైద్యులు సెల్వకుమార్, మణికండరాజా, వినోద్ లు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో జరగాల్సిన పోస్టుమార్టాన్ని ఇవాళ నలుగురు సభ్యుల వైద్య బృందం నిర్వహించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai techie  Swathi  Madras High Court  Ramkumar  suicide  post mortem  

Other Articles