స్వాతి హత్య కేసులో వాడు చచ్చాడు | Man Accused Of Murdering Chennai Techie Kills Himself In Jail

Man accused of murdering chennai techie kills himself in jail

Chennai Techie Murderer Ram Kumar, Ram Kumar Suicide, Swathi Murderer Ram Kumar Died, Ramkumar Died in Jail, Swathi Ramkumar Murder, Infosys Swathi death, Swathi Ram kumar, Ram Kumar in Swathi Case, Swargi Murder Video

Man Accused Of Murdering Chennai Techie Kills Himself In Puzhal jail.

టెక్కీ స్వాతి హత్యకేసులో ట్విస్ట్

Posted: 09/19/2016 09:35 AM IST
Man accused of murdering chennai techie kills himself in jail

చెన్నైలోకి సుంగంబాక్కం ప్రేమోన్మాది చేతిలో టెక్కీ స్వాతి దారణ హత్యకు గురైన విషయం విదితమే. ఈ కేసులో అనుకోని ట్విస్ట్ ఎదురైంది. ఆరోపణలు ఎదుర్కుంటున్న రామ్ కుమార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం జైల్లోని కరెంట్ తీగలను పట్టుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

కాగా, జూన్ 24వ తేదీన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని ఓ యువకుడు దారుణంగా హతమార్చాడు. హత్యకు వినియోగించిన కత్తిని పట్టాలపై విసిరివేసి ప్రయాణికులు చూస్తుండగానే పారిపోయాడు. రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ యువకుడు ఎంతో ఆందోళనగా పరుగెత్తడాన్ని గుర్తించారు. పుటేజీలోని ఫొటో సహాయంతో కేసు విచారణను ప్రారంభించిన పోలీసులు తిరునెల్వేలి జిల్లాలో రామ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను చూడగానే రామ్‌కుమార్ భయంతో గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చికిత్స జరుగుతున్న సమయంలో పోలీసులు అతడి నుంచి వాంగ్మూలం తీసుకోగా స్వాతి హత్యను అంగీకరించినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ టీ కే రాజేంద్రన్ స్వయంగా ప్రకటించారు.

Swathi ram Kumar suicide

గొంతు కోసుకున్న గాయంపై చెన్నై రాయపేటలో చికిత్స పొందుతున్న రామ్‌కుమార్‌కు కోర్టు జూలై 18వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఆపై రామ్‌కుమార్‌ను పుళల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆదివారం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్ కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు జైలు వద్ద ఆందోళనకు దిగారు. ఆత్మహత్య పైన తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. జైల్లోనే హత్య చేశారని ఆరోపిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Techie Swathi  Murderer  Ram Kumar  Puzhal jail  Suicide  

Other Articles