కాన్సర్ చిన్నారి కోసం ఒలంపిక్ పతకాన్ని అమ్మేశాడు | Piotr Malachowski sells Rio medal to save boy battling cancer

Polish olympian sells rio medal to save boy battling cancer

Polish Olympian Piotr Malachowski , Piotr Malachowski sells Rio medal, Rio medal to save boy battling cancer, Polish Olympian sells Rio medal

Polish Olympian Piotr Malachowski sells Rio medal to save boy battling cancer.

ఆ ఆటగాడు అప్పుడే పతకాన్ని అమ్మేశాడు

Posted: 08/26/2016 12:25 PM IST
Polish olympian sells rio medal to save boy battling cancer

పెరుగుతున్న పోటీ ప్రపంచంలో విజయం కోసం కఠోర శ్రమ అనేది తప్పనిసరిగా మారిపోయింది. అలాంటిది ఓ మంచి పని కోసం సంవత్సరాలుగా తాను పడ్డ కష్టానికి దొరికిన ప్రతిఫలాన్ని తృణ ప్రాయంగా వదిలేశాడో వ్యక్తి. కేన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారి కోసం తన సిల్వర్ పతకాన్ని వేలం వేశాడు.

పియోటర్ వలచోవ్ స్కీ వయసు 33 ఏళ్లు. పోలెండ్ కు చెందిన ఈ డిస్కస్ త్రో ఆటగాడు రియో ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించాడు. నాలుగేళ్లుగా అతను పడ్డ కష్టానికి ఈ ఘన విజయం అతని సొంతమైంది. కానీ, ఆ ఆనందం ముగిసి వారం కాకముందే తన విజయ సంకేతాన్ని అప్పుడే వేలానికి పెట్టేశాడు. ఈ విషయాన్ని తన పేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నాడు.

దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే ఎవరైనా అతన్ని అభినందించాల్సిందే. రెండేళ్లుగా కంటి వ్యాధితో బాధపడుతున్న ఒలెక్ అనే బాలుడు కంటి కాన్సర్ తో బాధపడుతున్నాడు. అతడి తల్లి తన కొడుకు వ్యధను వివరిస్తూ పియోటర్ కి లేఖ రాసిందట. అంతే ఏం ఆలోచించకుండా వెంటనే తన పతకాన్ని వేలం వేస్తున్నట్లు అతను ప్రకటించాడు.

ఒలంపిక్స్ లో స్వర్ణం కోసం ప్రయత్నించా... నిజానికి తాను రియోలో స్వర్ణపతకం సాధించాలనే చాలా ప్రయత్నించానని, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ అంతకంటే విలువైన వాటికోసం పోరాడాలని పిలుపునిస్తున్నానని మలచోవ్‌స్కీ తన ఫేస్‌బుక్ పేజిలో రాశాడు. ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తే, తన రజత పతకం ఒలెక్‌కు బంగారం కంటే చాలా విలువైనది అవుతుందని చెబుతూ తన పతకాన్ని వేలానికి పెడుతున్నట్లు చెప్పాడు. మొత్తానికి ఆ పిల్లాడి ఆపరేషన్ కి కావాల్సిన సొమ్ము సమకూరింది అనే అర్థం వచ్చేట్లుగా మళ్లీ సందేశం ఉంచాడు. అసలైన గెలుపు అంటే మానవత్వంలోనే దాగుందని నిరూపించిన పియోటర్ కి హాట్సాఫ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio Olmpics  Polish Olympian  Piotr Malachowski  Rio Silver Medal  Olek  

Other Articles