బెనారస్ యూనివర్సిటీ లో యువకుడి గ్యాంగ్ రేప్ | BHU male student gangraped by 5

Bhu male student gangraped by 5

BHU male student gangraped, Modi Constitute Gang rape, man gangraped in a moving car

BHU male student gangraped by 5, The student was gangraped in a moving car and was dumped in an open ground near the agricultural department of the university.

మద్యం తాగించి మరీ మగాడిని రేప్ చేశారు

Posted: 08/25/2016 09:13 AM IST
Bhu male student gangraped by 5

కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలు విచక్షణ మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. యూపీలోని బెనారస్ హిందీ యూనివర్సిటీలో ఏంఏ హిందీ చదువుతున్న 19 ఏళ్ల యువకుడిని 5గురు వ్యక్తులు అతికిరాతకంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోదీ నియోజకవర్గం వారణాసిలోనే ఇది జరగటం గమనార్హం.

పదిరోజుల క్రితం శ్రీ సుందర్ లాల్ ఆస్పత్రిలో తన బంధువు రిపోర్ట్ ల కోసం మైక్రో బయాలజీ విబాగంకు వెళ్లిన ఆ యువకుడిని ఐదుగురు దుండగులు అటకాయించారు. ఆపై అతనితో బలవంతంగా మద్యం తాగించి తమ కారులో పడేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అలా కదులుతున్న కారులోనే అతనిపై అత్యాచారం చేశారు. ఆపై రోడ్డుపై పడేసి వెళ్లిపోగా పోలీసులకు అతను సమాచారం అందించారు.

అతనికి రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించగా, అత్యాచారం జరిగింది ధృవీకరణ అయ్యింది. ఈ ఉదంతంతో ఆ యువకుడు షాక్ కి గురయ్యాడని, అత్మహత్య చేసుకుంటానని ఏడుస్తున్నాడని అతని తల్లి చెబుతోంది. ఈ ఘటనపై స్పందించేందుకు వీసీ నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం వర్సటీకే సిగ్గుచేటుగా చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  BHU  male student  gangraped  

Other Articles