ఆశ్రమం నీళ్లు తాగారని దళిత వ్యక్తి, కూతురిపై దాడి | Dalit Man, Daughter Beaten For Drawing Water from Handpump

Dalit man daughter beaten for drawing water from handpump

Dalit Man, Daughter Beaten up, Man daughter attacked by a temple priests, dalit famiy attack

Dalit Man, Daughter Beaten For Drawing Water from Handpump in Uttara Pradesh.

మంచి నీళ్లు తాగిందని మానవత్వం మరచి...

Posted: 08/10/2016 04:46 PM IST
Dalit man daughter beaten for drawing water from handpump

ఓవైపు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ తెలంగాణ పర్యటనలో దేశ ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేసి గంటలు గడవక ముందే మరిన్ని జరగటం విస్మయానికి గురిచేస్తోంది. బుధవారం ఉదయం ఆవు చర్మంపై ఆంధ్రప్రదేశ్ లో దళిత యువకులపై దాడి జరిగిన కొద్ది గంటలకే యూపీలో మరో దారుణ: చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ జిల్లాలో ఓ ఆశ్రమంలోని చేతిపంపు వద్ద నీళ్లు తాగారన్న నెపంతో దళిత కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లపై దాడి చోటు చేసుకుంది. గున్నోర్‌ ప్రాంతంలోని దుండా ఆశ్రమం ముందున్న చేతిపంపు వ‌ద్ద త‌న దాహాన్ని తీర్చుకునేందుకు స్థానికంగా కూలి పనిచేసుకునే 13 ఏళ్ల బాలిక వెళ్లింది. దీనిని గ‌మ‌నించిన ఆశ్రమంలోని వ్యక్తులు ఆ బాలిక‌పై దాడికి తెగబడ్డారు. రోదిస్తూ ఆ బాలిక ఇంటికి వచ్చి ఆ విషయాన్ని తండ్రికి చెప్పింది. త‌న కూతురిపై జ‌రిగిన దాడిని అడ‌గ‌డానికి వెళ్లిన ఆ వ్యక్తిని కూడా ఆశ్రమంలోని వారు చిత‌క్కొట్టారు. తీవ్రగాయాల పాలైన ఆ తండ్రీకూతుళ్లు ప్రస్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

కాగా, దళితుల మనోభావాలను దెబ్బతీయటం సరైంది కాదని, సంఘంలో హీనంగా చూడబడుతున్న వాళ్ల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందంటూ మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దళితుల విషయంలో ప్రధాని చూపుతుంది కపట ప్రేమేనని, ఆయన వ్యాఖ్యల తర్వాతే దాడులు ఎక్కువయ్యాయంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dalit family  daughter  attacked  hand pump  attack  

Other Articles