యువతి ఐపాడ్ దొంగిలించబోయిన డాల్ఫిన్ | Dolphin trys to snatch iPad of woman who taking it's photos

Dolphin trys to snatch ipad of woman who taking it s photos

Dolphin trys to snatch iPad, woman ipad snatch, Dolphin theft, Dolphin as thief, SeaWorld in Florida Dolphin

Dolphin trys to snatch iPad of woman who taking it's photos at SeaWorld in Florida.

ITEMVIDEOS: యువతి ఐపాడ్ పై కన్నేసింది ఎవరంటే?

Posted: 08/10/2016 10:22 AM IST
Dolphin trys to snatch ipad of woman who taking it s photos

ఫ్లోరిడాలో అదోక అందమైన సీవరల్డ్, సందర్శకులంతా కలియ తిరుగుతున్నారు. ఇంతలో ఓ యువతి తన ఐపాడ్ తో ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉంది. అక్కడే ఓ నీటి కొలను, అందులో అటు ఇటు గంతులేస్తున్న డాల్ఫిన్లు కనిపించాయి. ఇంకేముంది హడావుడిగా వెళ్లి వాటిని ఫోటోలు తీయటం ప్రారంభించింది.

కానీ, అంతలో అనుకోని ట్విస్ట్. ఏ డాల్ఫిన్ ఏకంగా ఐపాడ్ ను అమాంతం లాగేసుకుంది. వెంటనే అప్రమత్తమైన యువతి దాని నోటి నుంచి లాక్కునేందుకు ప్రయత్నించగా  ఆ పెనుగులాటలో అది కాస్త నీళ్లలో పడిపోయింది. ఆపై ఎలాగోలా ఐపాడ్ ను బయటికి తీసిన యువతి, నీళ్లను వదిలించడం ప్రారంభించింది. ఈ ఫన్నీ సంఘటనంతా అక్కడే ఉన్న మిగతా సందర్శకులు వీడియో తీయటం ఆరంభించారు.

దక్కినట్లే దక్కి ఐపాడ్ మిస్సయ్యిందని తెగ ఫీలయిపోయిన ఆ డాల్పిన్ కాసేపు నీళ్లలో పిచ్చి పట్టినట్లు గంతులేసి ఆపై తాపీగా వెళ్లిపోయింది. మనుషుల మాదిరే తెలివి తేటలు ఉన్న డాల్పిన్లు ఇలాంటి ఘటనలు పాల్పడిన సందర్భాలు చాలానే ఉన్నాయని, అందుకే మీ సామాన్ల జాగ్రత్త అనే బోర్డు కూడా అక్కడ ఉంటుందని వాటి సంరక్షకులు చెబుతున్నారు. కానీ, ఆ మహిళ మాత్రం తన ఐపాడ్ దొంగ గురించి సంబంధించిన వీడియోను నెట్లో అప్ లోడ్ చేసి లైక్ ల మీద లైక్ లు, షేర్ల మీద షేర్లు కొట్టేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Florida  seaworld  Dolphin  ipad  snatch  

Other Articles