Act against Rajasthan govt for death of 1,000 cows: Congress MP Pramod Tiwari asks PM Modi

Congress walk out of lok sabha in protest against atrocities faced by dalits

modi, narendra modi, cows, pramod tiwari, congress, cow protection, cow protectors, gau mata, gau rakshak, gau raksha, cow vigilante, cow issue, beef ban, india cow, rajasthan, rajasthan cows, Pramod Tiwari, shoot me, Dalits, gau rakshak, congress, BjP, PM Modi, Lok Sabha, india news

About 1,000 cows have died at the Jaipur Municipal Corporation's Hingonia cow rehabilitation centre, located 36 km from the state capital.

దళితులపై దాడులు.. లోక్ సభ నుంచి విపక్షం వాకౌట్

Posted: 08/08/2016 07:14 PM IST
Congress walk out of lok sabha in protest against atrocities faced by dalits

దేశంలో దళితులపై జరుగుతున్న దాడి పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుందని విపక్షాలు అరోపించాయి. దళితులపై బీజేపి, అర్ఎస్ఎస్ సహా గో రక్షణ సమితీలు చేస్తున్న దాడులపై గత రెండు నెలలు గా మౌనంగా వున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలలో వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారి విమర్శించారు. 'దళిత సోదరులపై కాదు.. నన్ను కాల్చండి' అంటూ దళిత ఓట్లకు మోదీ గాలం వేస్తున్నారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్, రాంచీలో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ ఇదే విధమైన ఆందోళన ఎందుకు వ్యక్తం చేయడం లేదని ప్రశ్నించారు.

నకిలీ గోవు రక్షకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రమోద్ తివారి స్పందించారు. నిజమైన గో హంతకులు ఎక్కడనున్నారో తాను చెబుతానని అన్నారు. రాజస్తాన్ ప్రభత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 1000 ఆవులు మరణించాయని, ఈ అంశంలో కేంద్రం ఎందుకు స్పందించడని ఆయన నిలదీశారు. మరణానికి కారణమైన రాజస్థాన్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. కాగా, కొందరు దళితులను పీడించి సమస్యలు సృష్టించాలనుకుంటున్నారని, దాడి చేయాలనుకుంటే తనపై చేయాలని ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనంలో నరేంద్ర మోదీ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pramod Tiwari  shoot me  Dalits  gau rakshak  congress  BjP  PM Modi  Lok Sabha  

Other Articles