రఘురాం రాజన్ చివరి మీటింగ్ పై టెన్షన్ | Raghuram Rajan's last monetary policy review

All eyes on raghuram rajan s last monetary policy review

RBI governor Raghuram Rajan, Raghuram Rajan last meeting, Rajan's last monetary policy review, Raghuram rajan good bye, Raghuram rajan last speech

RBI governor Raghuram Rajan's last monetary policy review.

చివరగా ఎలాంటి ట్విస్ట్ ఇవ్వకుండానే...!

Posted: 08/08/2016 05:31 PM IST
All eyes on raghuram rajan s last monetary policy review

బ్యాంకులకు పెద్దన్నగా వ్యవహరించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాస్ పదవి నుంచి మరో నెలన్నరలో విరమణ పొందనున్నాడు రఘురాం రాజన్. ఆయన నేతృత్వంలో మంగళవారం జరిగే తుది పరపతి సమీక్ష ఆఖరిది. ఈ నేపథ్యంలో దీనిపై మార్కెట్ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్ గా పదవీ విరమణ చేయబోయే ముందు ఆయన వడ్డీ రేట్లను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకుంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మూడేళ్ల పాటు భారతావనికి సేవలందించగా, రాజన్ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు విమర్శలకు కారణమైనప్పటికీ, ఆ ఫలాలు ప్రజలకు అందాయి. అంతకుముందు దువ్వూరి సుబ్బారావు గవర్నర్ గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలతో రూపాయి విలువ పతనం కాగా, దాన్ని స్థిరీకరించేందుకు రాజన్ తన వంతు ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా నిర్దేశించుకుని దాన్ని అందుకునేందుకు పరుగులు పెట్టి లక్ష్యానికి దగ్గరగా చేరారు. 6 శాతానికి పడిపోయిన స్థూల జాతీయోత్పత్తిని ఏడున్నర శాతానికి చేర్చారు.

అయితే ద్రవ్యోల్బణంలో ప్రస్తుత హెచ్చుతగ్గుల ఉన్న కారణంగా చివరి పరపతి సమీక్షలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకునే రిస్కీ చేయకపోవచ్చనే పలువురు అభిప్రాయపడుతున్నారు. తగ్గిన ద్రవ్యోల్బణం, పెరిగిన ఎగుమతులు, సంతృప్తికరమైన వర్షపాతం నేపథ్యంలో పావు నుంచి అర శాతం వరకూ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ఆయన ప్రకటించి వీడ్కోలు బహుమతిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మరికొందరు భావిస్తున్నారు. సమీక్ష అనంతరం ఆయన తన ప్రసంగంలో దేశ ఆర్థిక భవిష్యత్తుపై తన ఆలోచనలను పంచుకుంటారని భావిస్తున్నామని యాక్సిస్ బ్యాంకు ఎకానమిస్ట్ సౌగత్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. 

వచ్చే నెలలో పదవీ విరమణ చేసే రాజన్, ఆపై అమెరికాకు వెళ్లి ఉపాధ్యాయ బాధ్యతలను నిర్వహిస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పరపతి సమీక్ష జరిపి నిర్ణయాలు వెలువరించే అధికారం ఉన్న చివరి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మాత్రమే. ఆపై పరపతి సమీక్షలో ముగ్గురు కేంద్రం నియమించే వ్యక్తులు, ముగ్గురు ఆర్బీఐ ప్రతినిధులు ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోనుంటారన్న సంగతి తెలిసిందే. వీరి ఓట్లు సమానమైన సమయంలో ఆర్బీఐ గవర్నర్ తన విశేష ఓటును ఏ వైపు వేస్తే, ఆ నిర్ణయం అమలవుతుంది. ఈ నేపథ్యంలో రాజన్ చివరి పరపతి సమీక్షపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  governor  Raghuram Rajan  last  monetary policy review  

Other Articles