ఒంటినిండా రక్తపు గాయాలతో వైద్యుల వద్దకు వెళ్తే.. వారు నేరస్థులా..? లేక ఎవరా అన్న ఆరా తీయడానికి ముందు వారికి వైద్యం చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని భావిస్తారు వైద్యులు. అందుకే వారిని వైద్యో నారాయణో హరి అని దేవుడితో పొలుస్తుంటారు. అలాంటి ఓ మహిళా వైద్యురాలి వద్దుకు గ్యాంగ్ రేప్ బాధితులు వెళ్తే.. వైద్య వృత్తికే కళంకం తీసుకోచ్చేలా వారితో అత్యంత దారుణంగా ప్రపరించింది ఆ కర్కోటక వైద్యురాలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లో తల్లికూతుళ్ల గ్యాంగ్ రేప్ పాశవిక ఘటనకు సంబంధించిన ఘోర వాస్తవాలు ఒక్కక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
'కనీసం సాధారణ రోగుల్లానైనా మమ్మల్ని చూడలేదు. నా ఒంటినిండా గాయాలున్నాయి. నా కూతురికేమో విపరీతమైన రక్తస్రావం. అమ్మా.. ఏదో ఒకటి చెయ్యండమ్మా లేకుంటే నా బిడ్డ చనిపోతుందని డాక్టర్ కు మొరపెట్టుకున్నా. కానీ ఆమె మమమల్ని పట్టించుకోలేదు. మాపై సామూహిక అత్యాచారం జరిగిందని చెబితే ఆ డాక్టర్ నమ్మలేదు. పైగా, నోరుమూసుకొని వెళ్లి ఆ మూలన కూర్చోండని కసిరింద’ని గ్యాంగ్ రేప్ కు గురైన మహిళ తాజాగా ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాళ్లలో కూతురు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. తల్లి తమకు జరిగిన అవమానంపై కుమిలిపోతున్నది.
నోయిడాకు చెందిన టాక్సీడ్రైవర్ తన కుటుంబంతో షాజహాన్ పూర్ బయలుదేరగా.. ఢిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో కాన్పూర్ హైవేపై గల బులంద్ షహర్ వద్ద దుండగులు కారును అటకాయించి, లోపల ఉన్నవారిని బయటికిలాగి, పొలాల్లోకి తీసుకెళ్లి పురుషులను చెట్లకు కట్టేసి, తల్లి, 14 ఏళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దుండగులు వెళ్లిపోయిన తర్వాత కట్లు ఊడదీసుకుని, అరగంటపాటు పోలీస్ హెల్ప్ లైన 100కు ఫోన్ చేస్తూనే ఉన్నా. కానీ నంబర్ బిజీ అని సమాధానం వచ్చింది. తర్వాత మా వాళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడి మహిళా డాక్టర్ మమ్మల్ని పట్టించుకోలేదు. తెల్లవారాకగానీ పోలీసులు మా దగ్గరికి రాలేదు. వాళ్లు కూడా మా కుటుంబీకులపై అత్యాచారం జరిందంటే నమ్మలేదు. నాటకాలాడుతున్నామన్నట్లు మాట్లాడారు' అని బాధిత మహిళ మరిది మీడియాకు వివరించారు.
తమపై జరిగిన అకృత్యం అందరికీ తెలిసిపోయినందుకు సిగ్గుపడుతున్నామని, మళ్లీ నోయిడా వెళ్లి తలెత్తుకుని తిరగలేమని బాధితమహిళ మంగళవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఆమె గురించి తామంతా కుమిలిపోతున్నామని పేర్కొంది. దోషులను పట్టుకుని ఉరి తీయాలని, లేకుంటే తామే ఉరివేసుకుని చనిపోతామని దగ్ధస్వరంతో రోదించింది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ముగ్గురిని బాధిత కుటుంబీకులు గుర్తుపట్టారని, మరో ఐదుగురు ఇంకా పరారీలోనే ఉన్నారని బులంద్ షహర్ పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more