థియేటర్లలో పొగాకు వ్యతిరేక షార్ట్ ఫిల్మ్ లకు గుడ్ బై | No anti-smoking disclaimers suggests Benegal Committee

No anti smoking disclaimers suggests benegal committee

No anti-smoking ad in theaters, Shyam Benegal committee, Benegal committee on anti smoking ads

Shyam Benegal committee says screening of only one "meaningful static warning" made with standard visuals and approved by the health ministry against tobacco use and smoking at the start of the film.

హమ్మయ్యా! ఈ నగరానికి ఏమైంది... లేపేస్తున్నారంట

Posted: 08/01/2016 01:08 PM IST
No anti smoking disclaimers suggests benegal committee

తీవ్ర ఒత్తిడిలో ఉంటున్న నేటి తరం సరదాగా ఫ్రెండ్స్ తోనే, కుటుంబంతో వీకెండ్ లో సినిమాలకి వెళ్తుంది. వెళ్లి వెళ్లిగానే హాల్ లో ఓ కట్.. ఈ నగరానికి ఏమైంది ఓవైపు మూసీ... మరోవైపు పొగ. ఎవరూ నోరు మెదపరేంటి అంటూ ఓ షార్ట్ ఫిల్మ్, ఆపై ఆనందమైన కుటుంబాన్ని ఎవరు కోరుకోరు? అంటూ దగ్గుతూ ఉండే మరో వ్యక్తి షార్ట్ ఫిల్మ్ అది చూసే ఈ టార్చర్ ఏంట్రా బాబోయ్ అనుకోని వారు ఉంటారా? పోనీ ప్రారంభంలోనే కదా అని సర్దిపెట్టుకుంటే ఇంటర్వెల్ అయ్యాక మరో కట్.

హెచ్చరికల పేరుతో కేంద్ర ప్రభుత్వం తప్పని సరి చేసిన ఈ ప్రకటనలు ప్రేక్షకులకు తలనొప్పిగా మారిపోతున్నాయి. అయితే ఇకపై మాత్రం ఇవి ఉండకపోవచ్చనే వార్త కాస్త ఊరట కలిగిస్తోంది. కుటుంబంతో కలసి సరదాగా ఓ సినిమాకు వెళ్లిన వేళ, చిత్రం ప్రారంభ సమయంలో, ఆపై విశ్రాంతి తరువాత వచ్చే పొగాకు వ్యతిరేక షార్ట్ ఫిల్మ్ లు, చిత్రంలో మద్యపాన, ధూమపాన సన్నివేశాల వేళ, చికాకుపుట్టిస్తున్న ఈ హెచ్చరికలను తొలగించాలని ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగళ్ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.

దాని స్థానే ఆరోగ్య శాఖ ఆమోదించిన ఓ ఫోటోను చూపుతూ, కొన్ని సెకన్లపాటు బ్యాక్ గ్రౌండ్ ఆడియో వినిపిస్తే సరిపోతుందని చెప్పింది. దీన్ని అన్ని భాషల్లోనూ తయారు చేసి సినిమా ప్రారంభ సమయంలో వినిపిస్తే చాలని పేర్కొంది. ఒకవేళ అలా అంగీకరించని పక్షంలో తన చిత్రంలోని నటుడితో పొగాకుకు వ్యతిరేకంగా ఓ చిన్న షార్ట్ ఫిలిం తీసి దాన్ని మాత్రమే చిత్రం ముందు ప్రదర్శించే వెసులుబాటును కల్పించాలని కోరింది. దీనివల్ల ప్రేక్షకులు కూడా కొంత ఉపశమనంగా ఫీలవుతారని చెప్పింది.

ఇక సినిమాల్లో జంతువుల వాడకం తప్పనిసరని, ఎంపిక చేసిన జంతువులను వాడుకునే వెసులుబాటును నిర్మాతలకు దగ్గర చేయాలని కూడా సిఫార్సు చేసింది. ఈ మేరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకుని, కేర్ టేకర్లను నియమించుకుని తర్ఫీదు పొందిన జంతువులను షూటింగుకు వాడుకునేందుకు అంగీకరించాలని సూచించింది.

ఆరోగ్య శాఖ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు ప్రకటనలను చూపుతూ, చిత్రం నిడివి పెరిగి, ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని వాపోతున్న నిర్మాతలకు బెనగళ్ సిఫార్సులు కొంత ఆనందాన్ని కలిగించేవేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుందా లేదా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shyam Benagal  committee  anti-smoking ad  theaters  

Other Articles