కొత్త జిల్లాలపై కేసీఆర్ కు కొత్త చిక్కులు | new districts formation big headache to KCR

New districts formation big headache to kcr

CM KCR new districts, Telangana new districts formation, Congress on Telangana new districts, Telangana new districts

Telangana new districts formation big headache to CM KCR.

కేసీఆర్ కు కొత్త కొత్తగా చిక్కులు

Posted: 07/20/2016 04:06 PM IST
New districts formation big headache to kcr

కొత్త కొత్త నిర్ణయాలు, వాటి ద్వారా లక్ష్య సాధన ఎలా నెరవేర్చుకోవాలో తెలియాలంటే నేతలెవరైనా సరే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రిఫరెన్స్ గా తీసుకోవాల్సిందే. అలాంటిది గులాబీ అధిపతి ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటారని ఎవరైనా అనుకుంటారా? వాస్తవాలను ఓసారి గమనిస్తే...

తెలంగాణ రాష్ట్రంలో 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆకాంక్ష. అందుకు తగ్గట్లే ఏడాదిన్నర నుంచి కార్యాచరణ ప్రారంభించిన ఆయన ఆ నిర్ణయాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. దసరా లోపే వాటిని ప్రకటించబోతుంది ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ముందుకు వెళ్లటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులకు, ముఖ్యంగా సొంత నేతలకు లాభం చేకూర్చేలా ఈ నిర్ణయం ఉందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.

దీనికి తోడు ఇదే ఆసరాగా తీసుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన తేవటమే కాకుండా ఉద్యమాలను లేవదీస్తోంది. డీఎకే అరుణ లాంటి సీనియర్ నేతలు ఓ అడుగు ముందుకు వేసి అవసరమైతే ఆత్మత్యాగానికి అయినా సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ తేలికగానే తీసుకుంటున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, అంతర్గతంగా సీరియస్ గానే తీసుకుని అధికారులతో చర్చిస్తున్నారంట.

కొత్త జిల్లాల విషయంలో విమర్శలు చెబుతున్న మరోక బలమైన అంశం ఏంటంటే... కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్థికంగా పెను భారం పడే అవకాశం ఉందట. ఇప్పటికే 75 శాతం బడ్జెట్ పాలన కోసమే ఖర్చయిపోతుంది. ఈ కేసీఆర్ నిర్ణయం మరింత కష్టాల్లోకి నెట్టేదే తప్ప లాభం చేకూరదని విశ్లేషకుల అభిప్రాయం. ఈ అంశంపై పూర్తి నివేదికతో కూడిన శ్వేత పత్రం విడుదల చేయటం ద్వారా కొంతలో కొంతైనా వ్యతిరేకతను తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM KCR  new districts  congress  more districts  

Other Articles