ప్రత్యేకహోదా కాంగ్రెస్ బిల్లుకు టీడీపీ మద్ధతు | TDP decided To support KVP private bill On AP Special Status

Tdp decided to support kvp private bill on ap special status

chandra babu naidu KVP, chandrababu naidu private bill on special status, chandrababu naidu rajyasabha special status bill, AP special status bill in Rajyasabha, TDP support to KVP

TDP decided To support KVP private bill On AP Special Status

వెరైటీ: కాంగ్రెస్ బిల్లుకు చంద్రబాబు మద్ధతు?

Posted: 07/16/2016 09:46 AM IST
Tdp decided to support kvp private bill on ap special status

తెలుగు రాజకీయాల్లో అరుదైన ఘట్టం చోటుచేసుకోబోతుంది. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో అధికార తెలుగుదేశం ప్రభుత్వం కనివిని ఎరుగని నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓడిపోయి షెడ్డుకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే బిల్లుకు మద్ధతు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నాడు. ఒక్క సీటు గెలవకపోయానా బిల్లు పెట్టడమేంటి? దానికి టీడీపీ మద్ధతు ఏంటనేగా మీ అనుమానం...

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టనున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఓటింగ్ వరకు వస్తే... దానికి అనుకూలంగా ఓటేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ తీర్మానించింది. శుక్రవారం విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ మేరకు పార్టీ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం అందివచ్చే ఏ అవకాశాన్ని వదలుకోవద్దని ఆయన ఎంపీలకు సూచించారంట. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై ఎవరు మాట్లాడినా, పార్టీలతో ప్రమేయం లేకుండా మద్దతు తెలపాలని కూడా దిశానిర్దేశం చేశారంట. అయితే మిత్రపక్షం వైఖరిని నేరుగా ప్రశ్నించలేని ఆయన, ఇప్పుడు తాను పెట్టే బిల్లు చర్చకు వస్తే మద్ధతు ఇస్తానడటం హస్యాస్పదంగా ఉందని కేవీపీ అంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో బిల్లుపై అనుమానాలు నెలకొంటున్నాయని ఆయన వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  AP Special Status  Chandrababu  KVP  Rajyasabha  private bill  

Other Articles