Islamic State supporters celebrate deadly attack in France on social media

Isis supporters celebrate deadly france attack on social media

islamic state terroe group, ISIS supporters, celebrate, deadly attack, France, social media, france terror attack, nice terror attack, france bus crash, Bastille Day celebrations, national holiday, Day French, Riviera city of Nice, islamic state france attack, is france attack, france bus attack islamic state, news, world news, france news, international news, latest news, islamic state, nice, france, sebastien humbert, nice bus attack, is social media

The driver drove at high speed for over 100 metres (yards) along the famed Promenade des Anglais seafront in the French Riviera city of Nice before hitting the mass of spectators.

సోషల్ మీడియాలో ఇస్లామిక్ స్టేట్ సానుబూతిరుల హల్ చల్..

Posted: 07/15/2016 08:32 AM IST
Isis supporters celebrate deadly france attack on social media

ఫ్రాన్స్ దేశంపై ఎనమిది నెలల కాలంలో రెండో పర్యాయం విరుచుకుపడి, అమాయక ప్రజల ప్రాణాలను బిలితీసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఫ్రాన్సు పోలీసులు, భద్రతా దళాల ఊహలకు అందకుండా తమ ఉగ్రవాదులు ఫ్రాన్స్ లోని నైస్ నగరంపై విరుచుకుపడి 75 మంది ప్రాణాలను మట్టుబెట్టారంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా తమ చర్యలపై బాహాటంగా సంతోషాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారుతొంది.

జాతీయ దినోత్సవం సంబరాలను జరుపుకుంటున్న ప్రాన్స్ దేశ పౌరులపైకి తమ వారు విరుచుకుపడ్డారని దీంతో సుమారుగా 62 మంది పాపుల ప్రాణాలను తీశారని, భగవంతుడు చాలా గొప్పవాడని, గాడ్ ఈజ్ గ్రేట్ అని ఒక సానుభూతిపరుడు ట్విట్ చేశాడు.  నైన్ నగరంలో నిర్వహిస్తున్న వేడుకల సంబరాల్లో మునిగితేలుతున్న పౌరులపైకి.. అత్యంత వేగంగా భారీ ట్రక్కును నడిపించి అమాయక ప్రజల ప్రాణాలను హరించింది చాలక సామాజిక మాద్యమం ద్వారా ఆనందాన్ని సానుభూతి పరులు పంచుకోవడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే వీళ్లకు నిజంగా దేవుడంటే నమ్మకం వుందా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. అమాయక ప్రజలను తమకు తాము పాపులని చిత్రీకరించుకుని వారి ప్రాణాలను హరించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాణాసంచా వెలుగులను వీక్షిస్తున్న జనాలపైకి ఉగ్రవాదులు అతివేగంతో ట్రక్కును నడిపి అమాయకుల ప్రాణాలను పోట్టనబెట్టుకోవడం వాళ్ల దైవం అంగీకరిస్తుందా..? అని కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రక్కును నడిపిన డ్రైవర్ ను వీరుడిగా చిత్రీకరిస్తూ సాగుతున్న సోషల్ మీడియా ప్రచారానికి ఇకనైనా కళ్లెం వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : islamic state terroe group  ISIS supporters  celebrate  deadly attack  France  social media  

Other Articles