ఎన్ఐఏ అదుపులో మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు | Two more ISIS sympathisers arrested by NIA

Two more isis sympathisers arrested by nia

ISIS sympathisers, Hyderabad NIA, ISIS arrested by NIA

Two more ISIS sympathisers arrested by NIA in hyderabad.

ఎన్ఐఏ అదుపులో మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు

Posted: 07/12/2016 02:51 PM IST
Two more isis sympathisers arrested by nia

భాగ్యనగరంలో ఉగ్ర జాడలు ఇంకా సమసి పోలేదు. ఐదుగురు ఐఎస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పట్టేసిన సంగతి తెలిసింది. కోర్టు అనుమతితో దాదాపు 12 రోజుల పాటు సదరు ఉగ్రవాదులను అన్ని కోణాల్లో విచారించిన ఎన్ఐఏ... వీరిని మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. ఇంతలో మరో ఇద్దరు ఐఎస్ సానుభూతిపరులు అరెస్ట్ కావటం కలకలం రేపుతోంది.

ఐదుగురు ఉగ్రవాదులు విచారణలో భాగంగా వెల్లడించిన వివరాల ఆధారంగానే తాజా అరెస్ట్ లు జరిగినట్లు సమాచారం. మొఘల్ పురా, బండ్లగూడకు చెందిన అహ్మదుల్లా, యాసిర్ గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్టైన ఐదుగురు ఉగ్రవాదులతో వీరికి సంబంధాలున్నాయని పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరు కూడా ఉగ్ర కార్యకలాపాల్లో వీళ్లిద్దరిదీ కీలకపాత్రే అని తెలుస్తోంది. వీరిద్వారా కూడా పేల్లుళ్లు జరపాలని ప్లాన్ వేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

ఇక విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలను ఎన్ఐఏ కోర్టుకి వివరించింది. ఐసిస్ చీఫ్‌తో ఈ సానుభూతిప‌రులు మాట్లాడిన‌ట్లు తాము నిర్ధారించిన‌ట్లు ఎన్ఐఏ పేర్కొంది. తమ పేర్లు మార్చుకుని వీరంతా ఆన్‌లైన్‌లో సంభాషించిన‌ట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  sympathisers  Hyderabad  NIA  

Other Articles