మరో స్టార్ క్రికెటర్ పొలిటికల్ ఎంట్రీ | Pak player Shahid Afridi ready for political entry

Pak player shahid afridi ready for political entry

pak former captain, Shahid afridi, Afridi political entry

Pak Former skipper Shahid Afridi ready for political entry.

మరో స్టార్ క్రికెటర్ పొలిటికల్ ఎంట్రీ

Posted: 07/12/2016 09:41 AM IST
Pak player shahid afridi ready for political entry

స్వతహాగా రాజకీయ నేపథ్యం ఉన్న వారి కన్నా సెలబ్రిటీలే ఈ మధ్య పాలిటిక్స్ లో రాటుదేలిపోతున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు, క్రీడాకారులు రాణిస్తుండగా, కొందరు ఏకంగా మంత్రి పదవులే నిర్వహించడం చూస్తున్నాం. తాజాగా మరో స్టార్ క్రికెటర్ కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేందుకు సిద్ధమైపోతున్నాడు.

అయితే అది మన ఇండియన్ క్రికెటర్ కాదు. పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ. వీలైనంత త్వరగా తాను పాకిస్థాన్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని బీబీసీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం లండన్ లో రెస్ట్ తీసుకుంటున్న ఈ స్టార్ ఆటగాడు తిరగి రాగానే రాజకీయాల్లో చేరికపై మంతనాలు చేస్తాడంట. అయితే ఓ కొత్త పార్టీ పెడతాడా? లేక ఇప్పటికే ఉన్న పార్టీలో చేరతాడా? అన్న విషయం మాత్రం స్పష్టం చేయలేదు. అయితే, తన సన్నిహితులంతా రాజకీయాల్లోకి వెళ్లవద్దని తనను వారిస్తున్నారని అన్నాడు. భవిష్యత్ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని అఫ్రిదీ తెలిపాడు.

ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గమని అన్నాడు. సేవ చేసేందుకు తన పౌండేషన్ సరిపోతుందని, ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే సేవలందిస్తున్నానని, అయితే ఎక్కువ సంఖ్యలో ప్రజలకు సేవలు చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గమని భావిస్తున్నానంటూ పేర్కొన్నాడు. ఇప్పటికే లెజెండ్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీతో పాక్ రాజకీయాలను శాసిస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  shahid afridi  politics  Imran khan  

Other Articles