అమెరికాలో నల్ల జాతీయులపై పోలీసుల కాల్పులకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మిన్నెసోటా, లూసియానాల్లో అమెరికన్ పోలీసులు ఇద్దరు నల్ల జాతీయులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో ఆందోళనలు చెలరేగగా, నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు.
ఇక ఆందోళనకారులు పక్కా ప్రణాళికతో జరిపిన కాల్పులలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరో ఏడుగురికి కాల్పుల్లో తీవ్రగాయాలయ్యాయి. పోలీసులే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగినట్లు స్ఫష్టంగా తెలుస్తోంది. అయితే కాల్పులకు పాల్పడిన వారిలో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, డల్లాస్ లో పలు చోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అది నిరసనకారుల పని కాదని అల్లర్లను ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులే ఈ చేష్టకు దిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం డల్లాస్‌కు ఎయిర్ పోర్ట్ కు రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఒబామా షాకింగ్ వ్యాఖ్యలు:
కాగా, ఈ ఆందోళనలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశాడు. చూస్తుంటే ఇది జాతి వివక్ష చర్యలాగానే కనిపిస్తోందని పేర్కొన్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కువ మంది నల్లజాతీయులే బలవుతుండటం బాధకరమని వ్యాఖ్యానించాడు.
నాటో సమావేశం కొరకు పోలెండ్ లోని వార్సాకు చేరుకున్న ఒబామా మీడియాతో మాట్లాడారు. ఇలాంటి క్రూరమైన ఘటనల వల్ల అమెరికన్లందరూ ఇబ్బందులకు గురవుతారని వ్యాఖ్యానించారు. నల్లజాతీయులపై పోలీసులు జరిపిన కాల్పులు కావాలని చేసినవిగానే కనిపిస్తున్నాయని అన్నారు. అదే సమయంలో నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యం అంటే మిగిలిన వారి ప్రాణాలు తృణప్రాయం కాదని, ఎవరిదైనా జీవితమే అనే చెప్పటం కొసమెరుపు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more