ఆ టాయ్ లెట్స్ చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే... | Toilets for third gender in west bengal

Toilets for third gender in west bengal

Mamatha Benarjee govt for hijras, hijras toilets in West Bengal, Hijras toilets in India, West bengal Hijras

Mamatha Benarjee govt constuction separate toilets for third gender (Hijras) in West Bengal School and Colleges, Universities.

ఆ టాయ్ లెట్స్ చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే...

Posted: 07/08/2016 11:31 AM IST
Toilets for third gender in west bengal

మగ, ఆడకేనా మాలాంటి వాళ్లకు టాయ్ లెట్స్ లేవా అంటూ ప్రశ్నిస్తుంది వేదం సినిమాలోని కర్పూరం అనే హిజ్రా పాత్ర.. కానీ, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దయ వల్ల ఆ సీన్ కూడా త్వరలో దర్శనమివ్వబోతుంది. అక్కడి ప్రభుత్వ మరియు ఎయిడెడ్ కళాశాలల్లో హిజ్రా కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు కట్టించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

హిజ్రా సమస్యల పరిష్కారం కోసం ఆ రాష్ట్రం నియమించిన ట్రాన్స్ జెండర్ డెవలెప్ మెంట్ బోర్డు తన సిఫారసులను ప్రభుత్వానికి అందజేసింది. దీనిని పరిశీలించిన ఉన్నతవిద్యా శాఖ ఆ నివేదికను మమతకు సమర్పించగా, ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే త్వరలోనే అక్కడి యూనివర్సిటీల్లో జెంట్స్, లేడీస్ తోపాటు హిజ్రా అనే విభాగం కూడా దర్శనమివ్వబోతుందన్న మాట.

అయితే దీని ద్వారా ఆకతాయిలు వారిని ఆటపట్టించే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తుంది. అయినప్పటికీ ఇన్నాళ్లూ ఆడాళ్ల టాయి లెట్స్ వాడుకున్న తమకు ఇకపై ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయటంపై పలువురు హిజ్రాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు థర్డ్ జండర్ అంటేనే చిన్న చూపు చూసే మనలాంటి దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మమతా బెనర్జీ ప్రభుత్వంపై అభినందనలు కురుస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Bengal  Mamatha Benarjee  Hijras  toilets  

Other Articles