నమో సీసాలోకి కొత్త నీరు! | cabinet reshuffle no change in role for top four ministers

Telugu content

Narendra Modi cabinet, Modi cabinet reshuffle, new faces in cabinet reshuffle

Narendra Modi cabinet reshuffle no change in role for top four ministers

నమో సీసాలోకి కొత్త నీరు!

Posted: 07/04/2016 03:15 PM IST
Telugu content

కీలకమైన యూపీతోసహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, మలిదశ మంత్రివర్గ విస్తరణకు నరేంద్ర మోదీ సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆత్రుతతో చూస్తుంది. ఎవరెవరూ ఉంటారు, ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారో అని చర్చలు మొదలయ్యాయి. టాప్ నలుగురు మంత్రులు తప్ప మిగతా అన్నింట్లో మార్పులు తప్పవనే వార్తలు గుప్పుమంటున్నాయి. మెజారిటీ మంత్రుల పనితీరు పట్ల అంసతృప్తిగా ఉన్న మోదీ భారీగానే మార్పులు చేయబోతున్నారని సమాచారం.

ఇక ఈ దఫా విస్తరణలో కచ్చితంగా మంత్రి పదవులు దక్కుతాయన్న కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరంతా సోమవారం ఒక్కోక్కరుగా బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసి నుంచీ బిజీగా గడుపుతున్నారు. యూపీకి చెందిన ఎంపీ అనుప్రియా పటేల్ తొలుత అమిత్ షాను కలిశారు. దాదాపు పావు గంట పాటు ఆమె అమిత్ తో మాట్లాడి ఆపై వెళ్లిపోయారు. ఆపై గుజరాత్ రాజ్యసభ సభ్యుడు పురుషోత్తమ్ రూపాలాను అమిత్ పిలిపించి చర్చలు జరిపారు. రాజస్థాన్ నుంచి అర్జున్ రామ్ మేఘావల్ కూడా అమిత్ వద్దకు వచ్చారు. వీరు ముగ్గురికీ క్యాబినెట్ పదవులు ఖాయమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

వీరితో పాటు డార్జిలింగ్ బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలి, మహారాష్ట్రకు చెందిన ఎంపీ రామ్ దాస్ అతేవాల్ లు కొద్దిసేపటి క్రితం అమిత్ షాను కలిశారు. మధ్యాహ్నం తరువాత ఎంపీలు, యూపీలో అధిక ఓటు బ్యాంకున్న బ్రాహ్మణ వర్గ నేతలు మహేంద్ర పాండే, శివ్ ప్రతాప్ శుక్లాలు షాను కలిసే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్ నుంచి అజయ్ తమ్తా, శివసేనకు చెందిన అనిల్ దేశాయ్ పేర్లు కూడా క్యాబినెట్ కు జత కలిసే వీలుందని సమాచారం. ఇక ఓ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ఎంపీ నిహాల్ చంద్ కు కేంద్ర మంత్రి పదవి నుంచి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం మోదీ క్యాబినెట్ లో 66 మంది మంత్రులుండగా, రాజ్యాంగం ప్రకారం మరో 16 మందికి స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Cabinet  reshuffle  

Other Articles