కసాయి తల్లి ఎంత కిరాతకంగా చంపిందంటే...| driver Shyam Rai explained how Indrani kill sheena bora

Driver shyam rai explained how indrani kill sheena bora

Indrani kill sheena bora, Driver Shyam Rai Indrani kill sheena bora, Indrani kill sheena bora

Driver Shyam Rai explained how Indrani kill sheena bora

ITEMVIDEOS:కసాయి తల్లి ఎంత కిరాతకంగా చంపిందంటే...

Posted: 07/02/2016 04:09 PM IST
Driver shyam rai explained how indrani kill sheena bora

షీనా బోరా హత్య కేసులో కన్న తల్లి ఇంద్రాణీ ముఖర్జీయా చేసిన దారుణం బయటపడింది. అప్రూవర్ గా మారిన ఇంద్రాణీ కారు డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ హత్య జరిగిన తీరును కళ్లకు కట్టాడు. అయితే ఇందులో మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా హస్తం కూడా మాత్రం పేర్కొనలేదు. శ్యామ్ వర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా 17 పేజీల వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టు నిందితులందరికీ అందజేసింది.

వరుసకు సోదరుడైన పీటర్ కుమారుడు రాహుల్ తో ప్రేమలో పడిన కారణంగానే తల్లి ఇంద్రాణీ షీనాను మట్టుబెట్టాలని నిర్ణయించుకుందట. ఈ ప్లాన్ కు పీటర్, ఇంద్రాణీ మాజీ భర్త సంజీవ్ ఖన్నాలు సహకరించారని, తాను ఈ నేరంలో పాలుపంచుకున్నానని శ్యామ్ వర్ రాయ్ పేర్కొన్నాడు. ఆ రాత్రి జరిగిన ఘోరాన్ని పూసగుచ్చినట్లు అందులో వివరించాడు శ్యామ్.

2012, ఏప్రిల్ 24న షీనాను కారులో ఎక్కించుకుని మాట్లాడాలని ఇంద్రాణీ బయటకు తీసుకెళ్లింది. శ్యామ్ వర్ నోరు మూసేయగా, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియాలు షీనాను కదలకుండా పట్టుకున్నారు. ఇక ఆమెపై కూర్చున్న తల్లి ఇంద్రాణీ పాశవికంగా ఆమె గొంతు నులిమేసింది. ఈ క్రమంలో పెనుగులాడిన షీనా... శ్యామ్ వర్ చేతిని కొరికేసింది. దీంతో అతడి చేతికి గాయం కూడా అయ్యిందట. ప్రాణాల కోసం పెనుగులాడుతున్న కూతురుపై ఏ మాత్రం కనికరం చూపకుండా షీనా గొంతు నులిమి హత్య చేసిందట. ప్రస్తుతం ఈ స్టేట్ మెంట్ ను పరిగణలోకి తీసుకని వారికి శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Driver Shyam Rai  sheena bora  Indrani Mukharjee  

Other Articles