కోడెల డిస్మిస్ తో జంపింగ్ బాబులకు ఊరట|speaker kodela dismiss ysrcp petition on Jumping MLAs

Ap speaker kodela dismiss ysrcp petition on jumping mlas

Speaker Kodela YSRCP, YSRCP speaker Kodela, Kodela on Jumping MLAs, Kodela YSRCP petittion

Speaker kodela dismiss ysrcp petition on Jumping MLAs.

ITEMVIDEOS:కోడెల డిస్మిస్ తో జంపింగ్ బాబులకు ఊరట

Posted: 07/02/2016 02:50 PM IST
Ap speaker kodela dismiss ysrcp petition on jumping mlas

ఏపీలో జంపింగ్ ఎమ్మెల్యేలకు కాస్త ఊరట లభించింది. తమ పార్టీ నుంచి అధికార తెలుగు దేశం పార్టీలోకి చేరిపోయిన 13 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిని కొట్టివేస్తున్నట్లు శనివారం స్పీకర్ కోడెల చెప్పారు.

నోటీసు సరైన ఫార్మట్ లో లేకపోవటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, 13 మంది ఎమ్మెల్యేల పేర్లను ఆయన చదివి వినిపించారు. వారిలో జ్యోతుల నెహ్రూ, సుజయ కృష్ణ రంగరావు, చాంద్ బాష, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్, భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, డేవిడ్ రాజు, మణి గాంధీ తదితరులు ఉన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రాజీనామా ఇంకా అందలేదని చెప్పారు. కాగా, వీరిపై దాఖలైన పిటిషన్లేవీ సరైన ఫార్మట్ లో లేదనందునే డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, సాంకేతిక కారణాలంటూ పిటిషన్ ను రద్దు చేయటంపై వైసీపీ మండిపడుతోంది. మరోసారి కూడా నోటీసు ఇచ్చామని చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP assembly  Kodela Shivaprasad  YSRC  jumping MLAs  

Other Articles