గాడిదతో పండంటి మగబిడ్డ గ్యారెంటీ! | donkey ride for the birth of a male heir in gujarat

Donkey ride for the birth of a male heir in gujarat

Borvav donkey rally, Gujarat's Junagadh donkey, donkeys for Dhuleti, మగబిడ్డ కోసం గాడిద, గాడిదపై ఊరేగితే మగబిడ్డ, గుజరాత్ లో గాడిదతో మగబిడ్డ, గాడిద మగబిడ్డ, సంతానం కోసం గాడిద, తెలుగు వార్తలు, ఐటెం వార్తలు, తాజావార్తలు, donkey ride for male heirs

Borvav, in Gujarat's Junagadh district, not only do men desperately want to be paraded thus, there's actually a 'waiting list' to do so. That's because the men who want to ride donkeys far outnumber the number of donkeys in the village. the festive day of Dhuleti in this tradition-bound village and on this day, men who ride a donkey are actually celebrating the birth of an heir--the birth of a male heir, that is.

గాడిదతో పండంటి మగబిడ్డ గ్యారెంటీ!

Posted: 06/22/2016 04:14 PM IST
Donkey ride for the birth of a male heir in gujarat

ఈ ఆధునిక యుగంలో కూడా భార‌తీయుల మూఢ నమ్మకాల పిచ్చి ఎంత పీక్ లో ఉన్నాయో చెప్పేందుకు ఈ ఉదంతం ఓ మంచి నిదర్శనం. పిల్లల కోసం వైద్య శాస్త్రం లో జెనిటిక్ పద్ధతులను పాటిస్తున్న ఈ రోజుల్లో అక్కడ జనాలు మాత్రం గాడిదను ఆశ్రయిస్తున్నారు. ఔరా అనుకుంటున్నారా? పూర్తి వివరాలు తెలియాలంటే గుజరాత్ వెళ్లాల్సిందే.

ఆ రాష్ట్రంలోని ఓ గ్రామంలో నేటికీ ఓ విచిత్రమైన ఆచారం కొనసాగుతోంది. గాడిదపై ఊరేగితే మగపిల్లలు పుడతారన్న న‌మ్మకం! అందుకే, ఆ గ్రామంలో గాడిదలకు నేటికీ గిరాకీ కొనసాగడమే కాదు. ఏకంగా గాడిదల కోసం జనాలు వెయిటింగ్ లిస్టులో ఉంటారు. జునాగఢ్‌ జిల్లా బోర్వావ్‌ గ్రామంలోని ఈ గాడిద సవారీ నేటికీ కొనసాగుతోంది. వారి ఆచారం ప్రకారం మగ సంతానం కోసం ఆ ఇంట్లోని మగవారు గాడిద మీద వూరేగుతూ భిక్షాటన చేస్తారు. నిజానికి స్థానికంగా ఉండే పక్షులు, జంతువులకు ఆహారం పెట్టడం కోసం గాడిద మీద ఊరేగుతూ బిక్షాటన చేసే పద్ధతిని మొదలుపెట్టారు. రాను రాను గాడిదలపై ఊరేగే వారికి మగ సంతానం కలగకటంతో జనాల్లో ఆ నమ్మకం విపరీతంగా నాటుకుపోయింది.  

ఈ గ్రామంలో రెండు గాడిదలుండగా వాటి మీద ఎక్కేందుకు స్థానికులు పోటీ పడుతుంటారు. ఇదే అదనుగా ఆ గాడిద ఓనర్లు అందినంత బాదేస్తున్నారు. ఈ గాడిద సెంటిమెంట్ దశాబ్దాలుగా కొనసాగుతోందని ఆ గ్రామ‌వాసి ఒక‌రు చెప్పారు. నమ్మకంతో దేవుళ్లని మొక్కటం చూశాం కానీ, ఇలా గాడిదలను ఆశ్రయించటం మాత్రం విడ్డూరమే. అయినా ఎవరి నమ్మకాలు వారికుంటాయి. ఏమన్నా అంటే మనోభావాలు దెబ్బతింటాయి!

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat's Junagadh  Borvav  donkeyride  male heir  

Other Articles