ఇస్రో టీ20 గ్రాండ్ సక్సెస్ | ISRO successfully launched a record 20 satellites

Isro successfully launched a record 20 satellites

ISRO launched a record 20 satellites, ఒక్క రాకెట్ తో ఇరువై శాటిలైట్లు, తాజా వార్తలు, ఇస్రో వార్తలు, తెలుగు వార్తలు, శ్రీహరి కోట, PSLV-C34 is being used to carry the 20 satellites, latest news

The Indian Space Research Organisation (ISRO) on Wednesday launched a record 20 satellites from its Satish Dhawan Space Centre in Andhra Pradesh’s Sriharikota. The launch of PSLV C-34/Cartosat-2 Series Satellite Mission took place at 9:26 am. Polar Satellite Launch Vehicle PSLV-C34 is being used to carry the satellites, including India’s earth observation spacecraft Cartosat-2, from the second launch pad of the space centre.

ITEMVIDEOS: ఇస్రో టీ20 గ్రాండ్ సక్సెస్

Posted: 06/22/2016 10:05 AM IST
Isro successfully launched a record 20 satellites

బుధవారం ఉదయం ఆకాశంలో అద్భుతానికి తెరలేచింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక రాకెట్‌ ద్వారా 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇస్రో నమ్మిన బంటైన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)సి-34 ద్వారా ఈ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయి. ఇప్పటివరకూ ఒకేసారి పది ఉపగ్రహాలను నింగిలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. కానీ, ఇప్పుడు 20 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి సరికొత్త అధ్యయనం సృష్టించింది.

భారీగా ఉపగ్రహాలను ఒకే రాకెట్‌ ద్వారా నింగిలోకి పంపు తుండడంతో యావత్ భారత్‌ తోపాటు ప్రపంచ దేశాలు ఆసక్తితో గమనించాయి. సోమవారం ఉదయం  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుండి ఈ ప్రయోగం జరిగింది. 9.26 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ నిరాటంకంగా కొనసాగింది. దాదాపు 26 నిమిషాల పాటు ఉత్కంఠతో కొనసాగిన ఈ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది.  మూడు స్వదేశీ ఉపగ్రహాలు, 17 విదేశీ ఉప గ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించింది.

కార్టోశాట్‌తోపాటు అమెరికా, కెనడా, ఇండోనేషి యా, జర్మనీ దేశాల శాటిలైట్లు, చెన్నైలోని సత్యభా మ యూనివర్సిటీ, ఫుణె ఇంజినీరింగ్ కాలేజీ తయారు చేసిన ఒక్కోశాటిలైట్‌ను నింగిలోకి పంపింది. ఇదిలాఉండగా, అమెరికా పంపుతున్న ఉపగ్రహాలలో గూగుల్ కంపెనీ తయారుచేసిన హైటెక్ ఉపగ్రహం స్కైశాట్ జెన్-2కూడా ఉంది. వాస్తవానికి ఈ నెల 20వ తేదీనే ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. చివర్లో రాకెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా 22వ తేదీకి వాయిదా వేశారు. మొత్తం 1,288 కిలోల బరువున్న 20 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి తీసుకుపోయింది.

505 కిలోమీటర్లు ఎత్తులో 97.48 డిగ్రీల వాలులో భూ స్థిర కక్ష్యలో ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి ఉంచింది. భారత్‌కు చెందిన కార్బోశాట్‌ - 2సి బరువు 725 కిలోలు. మిగిలిన 19 ఉపగ్రహాల బరువు 560 కిలోలు. తమిళనాడుకు చెందిన సత్యభామ యూని వర్సిటీ విద్యార్థులు రూపొందించిన 1.5 కిలోల బరువున్న సత్యభామ శాట్‌, పూనే విశ్వవిద్యాలయ విద్యార్థులు తయారు చేసిన కిలో స్వయంశాట్‌ ఉపగ్రహంతో పాటు మరో 17 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. శాన్‌ఫ్రాన్సిస్కోకోకు చెందిన 12 డోల్‌ ఉపగ్రహాల్లో ఒక్కోదాని బరువు 4.7 కిలోలు.

ఇవి మూడేళ్లపాటు నిరాటకంగా పనిచేస్తాయి. ఇందులో టెలిస్కోప్‌ సిసిడి కెమెరాలు ఏర్పాటు చేశారు. భూమిపై జరిగే మార్పులను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తుంటాయి. యుఎస్‌కు చెందిన స్కేశాట్‌- సి1 ఉపగ్రహం బరువు 110 కిలోలు. ఇది ఆరేళ్లుపాటు పని చేస్తుంది. భూమిని పరిశో ధించడం, గ్లోబల్‌లో మార్పులను అన్వేషిస్తుంది. ఇందులో సబ్‌-మీటర్‌ ఇమేజింగ్‌ అండ్‌ హెచ్‌డి వీడియోస్‌ను ఉపయోగిం చారు. కెనడాకు చెందిన జిహెచ్‌సి శాట్‌ ఉపగ్రహం దీని బరువు 25.5 కిలోలు. మేసేజింగ్‌ మైక్రో శాటిలైట్‌ (ఎం3ఎం) ఉపగ్రహం దీనిని కెనడీయాన్‌ స్పేస్‌ ఏజెన్సీ తయారు చేసింది. దీని బరువు 85 కిలోలు. బీరోస్‌
ఈ ఉపగ్రహం బరువు 130 కిలోలు. జర్మన్‌ హేరో స్పెస్‌ సెంటర్‌ దీనిని తయారు చేసింది. ఇది కూడా మూడేళ్లు పనిచేస్తుంది. ఇండోనేషి యాకు చెందిన లపా-ఎ3 ఉపగ్రహం బరువు 120 కిలోలు. భూమి, సహజ వనరులు, పర్యావరణం పరిశీలన చేస్తుంది.  పిఎస్‌ఎల్‌వి ద్వారా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించిన భారత్‌ ఇదీ తప్పక విజయం సాధిస్తుందనే ధీమాతో ఉంది.

కార్బోశాట్‌ -2సి:
ఇస్రో ఇప్పటివరకు పలు కార్బోశాట్‌ ఉపగ్రహ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. తొలిసారిగా 2007లో కార్బోశాట్‌ -2 ప్రయోగం జరిగింది. ఇందులో కొంత ఇబ్బందులు రావడంతో మళ్లీ కార్బోశాట్‌ -2ఎ, 2010లో కారోశాట్‌ -2బి ప్రయోగం విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ కార్బోశాట్‌ -2సి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 0.65 మీటర్లు ఉంది. ఇందులో అత్యంత ఆధునీకమైన ఫొటో ఇమేజింగ్‌ సిస్టమ్స్‌, వీడియో తీసే కెమెరాలను అమర్చారు. భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. భూమి, వాతావరణం. సముద్రతీర ప్రాంతం, పర్యావరణం అంశాలను అధ్యయనం చేయడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది.

పీఎస్ఎల్వీ:
ఇస్రో పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్ఎల్వీ) పైనే పెట్టుకున్న ఆశలు వమ్ముకాలేదు. ఇస్రోకు ఇది విజయవంతమైన రాకెట్‌. ఇప్పటివరకు 35 ప్రయోగాలు పూర్తి చేయగా, 34 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు జరుగింది 36వది. 2008లో పీఎస్ఎల్వీ ద్వారా పది ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇప్పుడు మళ్లీ భారీగా 20 ఉపగ్రహాలను తీసుకెళ్లింది. 44 మీటర్లు పొడవు, 320 టన్నులు బరువున్న  స్టాఫాన్‌ బూస్టార్స్‌ వాడుతున్నారు. ఇది ఎక్స్‌ఎల్‌ వర్షన్‌. నాలుగు దశల్లో ప్రయోగం జరగనుంది. 12 మీటర్లు సాలిడ్‌ ప్రొపలెంట్‌ నింపారు. దీని ద్వారా అక్టోబర్‌ 22, 2008న ఎక్స్‌ఎల్‌ మోటర్లుతో చంద్రయాన్‌-1 ప్రయోగం జరిగింది. అత్యంత వేగం, దూరం వెళ్లడానికి వీటిని వాడుతారు. 99 శాతం సక్సెస్‌ రేటున్న పీఎస్ఎల్వీ పై ఇస్రో నమ్మకం తప్పలేదు. ఆ నమ్మకంతోనే గతంలో 1448 కిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించారు. అత్యంత ఎక్కువ ఉపగ్రహాలు ప్రయోగించింది మాత్రం ఇదే. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో ఇస్రో మరో రికార్డును అధిగమించినట్లయ్యింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  20 satellites  PSLV-C34  

Other Articles