హెలికాప్టర్ తో ఏంటా పనులు? | Crazy dad uses real helicopter to pull son's loose tooth

Pilot uses real helicopter to pull son s loose tooth

A pilot from Virginia, removing his son’s loose tooth using a helicopter, హెలికాప్టర్ తో పన్ను ఊడగొట్టాడు, హెలికాప్టర్ తో ఏంటా పనులు, కొడుకును హెలికాప్టర్ కి కట్టి, crazy dad ties son

Crazy dad uses real helicopter to pull son's loose tooth. A pilot from Virginia has posted footage of himself removing his son’s loose tooth using a helicopter. Rick Rahim, from Virginia, flies helicopters for a living, and when his 7-year-old son Carson’s tooth became loose he did not waste time by tying it to a door handle. Instead, Mr Rahim tied one end of a string around his son’s tooth, and the other end to his fully sized commercial helicopter.

ITEMVIDEOS:హెలికాప్టర్ తో ఏంటా పనులు?

Posted: 06/21/2016 11:31 AM IST
Pilot uses real helicopter to pull son s loose tooth

రికార్డులు సృష్టించి వార్తల్లోకి ఎక్కాలనుకునే వాళ్లను చూశాం కానీ, చిలిపి పనులతో కూడా ఆ పని చేయవచ్చని నిరూపించాడు ఇక్కడో వ్యక్తి. వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తి సాహసాల జోలికి పోకుండా ఓ వెరైటీ ఆలోచనతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇందుకోసం తన ఏడేళ్ల కొడుకును, ఓ హెలికాప్టర్ ను వాడుకున్నాడు.

రిక్ రహీమ్ అనే హెలికాప్టర్ పైలట్ కొడుకు కార్సన్ కి పాలపళ్లు ఊడుతున్నాయి. సాధారణంగా ఇలాంటప్పుడు పళ్లు ఊడగొట్టేందుకు దంత వైద్యులు సంప్రదిస్తారు. కానీ, ఇక్కడ రహీమ్ మైండ్ లో ఓ విచిత్రమైన ఆలోచన మెదిలింది. తన కొడుకుని తెగ ఇబ్బంది పెడుతున్న ఓ పన్నుని తన హెలికాప్టర్ తో దెబ్బకి ఊడగొట్టాడు.

కొడుకును హెలిపాడ్ మీద నిల్చోబెట్టి ఓ పెద్ద దారాన్ని గట్టిగా కట్టి, దాన్ని హెలికాప్టర్ కు చుట్టి హెలికాప్టర్ని మెల్లగా పైకి పోనిచ్చాడు. అంతే... ఫటుక్కుమని ఆ బుడతడి పన్ను ఊడొచ్చింది. ఈ తతంగమంతా వీడియో తీయించి సోషల్ మీడియాలో పెట్టాడు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న సాహసంతో కూడిన చిలిపి పనులు చేయాలంటూ సలహా కూడా ఇస్తున్నాడు. గతంలో డ్రోన్ లు, వాహనాలు పన్నుకి కట్టి ఊడగొట్టిన సందర్భాలున్నప్పటికీ ఇలా హెలికాప్టర్ తో ఊడగొట్టిన ఇదే మొదటిసారంట.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virginia dad  son’s loose tooth  helicopter for tooth  

Other Articles