కూల్ డ్రింక్స్ టాక్స్ గురించి విన్నారా? | Soda Tax imposed in Philadelphia

Soda tax imposed in philadelphia

Philadelphia, soda tax, Berkeley soda tax, California soda tax, కూల్ డ్రింక్స్ పన్ను, ఫిలడెల్పియా కూల్ డ్రింకులపై పన్ను, సోడా టాక్స్, అంతర్జాతీయ వార్తలు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, international news, soda tax first imposed in, telugu news

Philadelphia is 1st major American city with soda tax.Philadelphia became the first major American city with a soda tax on Thursday despite a multimillion-dollar campaign by the beverage industry to block it. The City Council gave final approval to a 1.5 cent-per-ounce tax on sugary and diet beverages. The tax is set to take effect Jan. 1. Only Berkeley, California, has a similar law. Soda tax proposals have failed in more than 30 cities and states in recent years, including twice in Philadelphia. Such plans are typically criticized as disproportionately affecting the poor, who are more likely to consume sugary drinks.

కూల్ డ్రింక్స్ టాక్స్ గురించి విన్నారా?

Posted: 06/17/2016 01:22 PM IST
Soda tax imposed in philadelphia

పన్ను మోత మోగించి ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వాలు దేన్నీ వదలటం లేదు. ఆఖరికి శీతల పానీయాలపైనా టాక్స్ వేసేందుకు సిద్దమయిపోయారు. అయితే అది మనదేశంలో కాదులేండి. ఫిలడెల్ఫియా నగరం 'సోడా టాక్స్'ను అమల్లోకి తెచ్చిన తొలి పెద్ద అమెరికా నగరంగా నిలిచింది. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ టాక్స్ విధించేందుకు 48 శాతం ప్రజలు మద్ధతు తెలపడటంతో లైన్ క్లియర్ అయినట్లయ్యింది.

ఈ పన్ను వద్దని బీవరేజ్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టి ప్రచారం నిర్వహించినా, సిటీ కౌన్సిల్ తుది ఆదేశాలు జారీ చేస్తూ, ప్రతి ఔన్సు కూల్ డ్రింక్ పై 1.5 సెంట్ల పన్ను కట్టాల్సిందేనని తేల్చింది. దీని ప్రకారం, సోడాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ 300 ఎంఎల్ బాటిల్ పై 15 సెంట్లు ( మన కరెన్సీలో సుమారు రూ. 9) కట్టాల్సి వుంటుంది. ఈ పన్నును కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి వసూలు చేస్తామని కౌన్సిల్ వెల్లడించగా, ఆ భారం మొత్తం వినియోగదారులు భరించాల్సిందేనని కంపెనీలు చెబుతున్నాయి. 16 ఔన్సుల కూల్ డ్రింక్ బాటిల్ ఖరీదు 1.44 డాలర్ల వరకూ పెరుగుతుందని అంచనా.

కాగా, కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియా సహా 30 నగరాలు సైతం ఇదే తరహా చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ, అమలులో విఫలయ్యాయి. ఈ పన్నును సక్రమంగా అమలు చేస్తే, సాలీనా 90 మిలియన్ డాలర్ల ఆదాయం తమ ఖజానాకు వస్తుందని ఫిలడెల్ఫియా మేయర్ జిమ్ కెన్నీ వెల్లడించారు. ఈ నిధులతో చిన్నారుల విద్యావసరాలు తీర్చడంతో పాటు, పాఠశాలలు, రిక్రియేషన్ సెంటర్ల అభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు. ఈ ఉత్తర్వులు 2017 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఫిలడెల్ఫియా కౌన్సిల్ ప్రకటించింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Philadelphia  soda tax  America  

Other Articles