ట్టలు మార్చుకుంటుండగా బంధించి ఆపై... | man arrested for fixing secret cam in the female changing rooms

Man arrested for fixing secret cam in the female changing rooms

Bank employee, secret camera in female changing rooms, The European Investment Bank, బ్యాంకు ఉద్యోగి పాడు బుద్ధి, ఆడాళ్ల గదిలో సీక్రెట్ కెమెరా, తాజా వార్తలు, ఐటెం వార్తలు, తెలుగు వార్తలు, latest news

Bank employee arrested for fixing secret camera in the female changing rooms. The European Investment Bank has suspended an employee for allegedly installing secret cameras in the female changing rooms, sources close to the bank said Thursday.

బట్టలు మార్చుకుంటుండగా బంధించి ఆపై...

Posted: 06/17/2016 12:21 PM IST
Man arrested for fixing secret cam in the female changing rooms

ఐదు పదుల వయసులో ఆ పెద్దాయన బుద్ధి పక్కతోవ పట్టింది. ఆడాళ్లు బట్టలు మార్చుకునే గదిలో సీక్రెట్ కెమెరాను పెట్టాడు. ఆ వీడియోలన్నింటిని జమచేసి పోర్న్ సైట్లకు విక్రయిద్దామని ప్రయత్నించాడు. అతగాడి బండారాన్ని మరో కెమెరా భయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జాబ్ పోవటంతోపాటు, ఊచలు లెక్కిస్తున్నాడు.

మూడువేల మంది పనిచేసే యూరోపియన్ యూనియన్ బ్యాంకులో ఆ వ్యక్తి ఓ ఉన్నతస్థాయి అధికారిగా పనిచేస్తున్నాడు. గత మార్చినెలలో ఆడాళ్లు బట్టలు మార్చుకునే గదిలో టేబుల్ కింద ఓ సీక్రెట్ కెమెరాను ఉంచాడు. వారి వీడియోలన్నింటిని సేకరించి తన ల్యాప్ టాప్ లో, మొబైల్ ఫోన్ లో భద్రపరుచుకున్నాడు. అనుమానం వచ్చిన ఓ మహిళ కెమెరాను గమనించి యాజమాన్యానికి విషయం చేరవేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ సీక్రెట్ కెమెరా గుట్టును తేలికగానే పసిగట్టగలిగారు.

ఆ రూం బయట ఉన్న సీసీ వీడియో పుటేజ్ ను పరిశీలించగా, సదరు వ్యక్తి అందులోకి వెళ్లటం మొత్తం రికార్డయ్యింది. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. అతను వాటిని నిజంగానే పోర్న్ సైట్లకు అమ్మాలనుకున్నాడా లేక బ్లాక్ మెయిలింగ్ కి దిగి ఇంకేమైనా చేద్దామనుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది. అతగాడి డేగ కన్నుకు చిక్కిన మహిళల సంఖ్య 150కి పైగానే ఉన్నట్లు సమాచారం.

భాస్కర్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles