ఒబామా కూతురికీ అది తప్పలేదంట | Barack Obama Cried At Malia's School Graduation

Barack obama cried at malia s school graduation

Barack Obama, Barack Obama cry, Barack Obama cry for daughter, Barack Obama cried for malia, మలియా కోసం ఏడ్చిన ఒబామా, కూతురి కోసం ఏడ్చిన ఒబామా, ఒబామా కంట కన్నీరు, మలియా ఒబామా, బరాక్ ఒబామా ఏడ్చేశాడు, latest news, telugu news, తాజా వార్తలు, తెలుగు వార్తలు, అమెరికా వార్తలు, రాజకీయాలు

Barack Obama Cried At Malia's School Graduation. President Barack Obama has said that he cried at the recent high school convocation ceremony of his elder daughter Malia, thinking about how she is graduating at this "extraordinary time" for women in America.

ఒబామా కూతురికీ అది తప్పలేదంట

Posted: 06/16/2016 11:50 AM IST
Barack obama cried at malia s school graduation

త్వరలో పెద్దన్న పాత్ర నుంచి ఒబామా తప్పుకోనున్నాడు. ఇన్నాళ్లూ అమెరికా అధ్యక్షుడిగా ఒక నల్ల జాతీయుడై ఉండి జాతి వివక్ష అంశాన్ని వివాదాస్పదం చేయకుండా ప్రజల మధ్య ఐక్యత కోసం, ఇతర దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. ఇక చివరి రోజుల్లో ప్రజల్లో కలిసిపోతూ తన మనోభావాలను వారి ముందు ఉంచుతున్నాడు.

ఈ క్రమంలో అధ్యక్షుడి హోదాలో వైట్ హౌస్ లో జరిగిన మహిళా సదస్సులో లింగ అసమానతలు గురించి ఉపన్యసించాడు. ఈ సందర్బంగా తన పెద్దకూతురు మలియా గ్రాడ్యుయేషన్ గురించి ప్రస్తావిస్తూ కంటతడి పెట్టుకున్నాడు. వాషింగ్టన్ లోని సిడ్ వెడ్ ఫ్రెండ్స్ స్కూల్ నుంచి నా కూతురు మలియా గ్రాడ్యేయేషన్ పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమం శుక్రవారం జరిగింది. దానికి హాజరైన నేను ఎవరూ గుర్తుపట్టకుండా నళ్ల కళ్లద్దాలు పెట్టుకుని చివరి వరుసలో కూర్చున్నా. మలియా పట్టా తీసుకుంటున్న సమయంలో ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేశా. నా ముందు సీటులోని వాళ్లు నన్ను చూడటంతో బలవంతంగా ఏడ్పు ఆపుకున్నా. అని భావోద్వేగంతో చెప్పుకోచ్చాడు.

అగ్రరాజ్యంగా వెలుగొందుతున్నప్పటికీ అమెరికాలో లింగవివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. విద్యా, ఉద్యోగ పరమైన విషయాల్లో ఇప్పటికీ మహిళలపై వివక్షత చూపుతున్నారు. సాలీనా భారత్ లో 48 శాతం మహిళలకు ఉద్యోగాల్లో ఉపాధి కల్పిస్తుంటే, అక్కడ మాత్రం అది కేవలం 17 శాతంగానే ఉంది. దీన్ని బట్టి వివక్షత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని నిర్మూలనకు ఒబామా హయాంలో మహిళలు, బాలికల కోసం వైట్ హౌస్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అయినా లింగ సమానత్వం సాధించడానికి ఎంతో చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధ్యకుడిగా కంటే ఓ తండ్రిగా తన కూతురు లింగవివక్షత ఎదుర్కుని సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఒబామా.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles