దాడులు జరిగినా పోరాటం ఆగదు | fight for people not for parties JAC chairman kodandaram

Fight for people not for parties jac chairman kodandaram

JAC chairman kodandaram, prof kodandaram telangana, JAC chairman kodandaram t govt, కోదండరాం, తెలంగాణ ప్రభుత్వం కోదండరాం, కోదండరాం జేఏసీ భేటీ, తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు, తాజావార్తలు

fight for people not for parties JAC chairman kodandaram.

ITEMVIDEOS:దాడులు జరిగినా పోరాటం ఆగదు

Posted: 06/08/2016 04:01 PM IST
Fight for people not for parties jac chairman kodandaram

పార్టీలు, నేతలు తమ ఎజెండా కాదని, ప్రజలే తమకు ముఖ్యమని జేఏసీ చైర్మన్ కోదండరాం అంటున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలనే నెరవేర్చాల్సిందిగా తాము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. బుధవారం జేఏసీ కీలకభేటీ జరిగిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా ముందుకెళ‌తామ‌ని, దాడులు జరిగినా వెనక్కి తగ్గేదని ఉద్ఘాటించారు.  

కాగా, స‌మావేశంలో చాలా సూచ‌న‌లొచ్చాయ‌ని, వాటన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. తెలంగాణ‌లో కొన‌సాగుతోన్న భూసేక‌ర‌ణ విధానం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. మ‌ల్లన్న సాగ‌ర్ భూ నిర్వాసితుల కోసం ముఖాముఖి నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. వ‌ర్సిటీల స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం ఓయూ వేదిక‌గా ఓ భారీ స‌ద‌స్సును జ‌రుపుతామన్నారు. ఓపెన్ కాస్ట్ గ‌నుల‌కు వ్యతిరేకంగా పోరాడటం చేయాలని జేఏసీ తీర్మానించినట్లు చెప్పారు.

న్యాయం కోసం న్యాయవాదులే రోడ్డేక్కటం శోచనీయమని పేర్కొన్నాడు. పాఠ‌శాలలు బ‌ల‌పేతం కావాల‌ని, ఉచిత విద్య అమ‌లు కావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానం తమ పాలసీ కాదని చెప్పిన ఆయన ప్రజల కోసమే తమ పోరాటం అని నొక్కి చెప్పారు. కాగా, తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలపై ఆయన స్పందించలేదు. తాను న‌లుగురికీ చెప్పే వాడిని కానీ చెప్పించుకునే వాడిని కాద‌ంటూ కోదండరాం వ్యాఖ్యానించారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : T JAC meeting  JAC prof kodandaram  kodandaram KCR  

Other Articles