ఆధార్ తో కాపురాలు కూలిపోతున్నాయి | husband illegal affair came into limelight with Aadhaar

Husband illegal affair came into limelight with aadhaar

chittoor, chittoor husband, illegal affair, Aadhaar, ఆధార్ తో అక్రమ సంబంధాలు, చిత్తూర్, చిత్తూరు భర్త, అక్రమసంబంధం, ఆధార్, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, telugu news

chittoor husband illegal affair came into limelight with Aadhaar . so many cases like this in district.

ఆధార్ తో కాపురాలు కూలిపోతున్నాయి

Posted: 06/06/2016 11:17 AM IST
Husband illegal affair came into limelight with aadhaar

ప్రతి పౌరుడికీ గుర్తింపు కార్డును జారీ చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం అమలు చేసి జారీ చేసిందే ఆధార్. యూఐడీఏఐ గా పరిగణించబడే ఈ 16 అంకెలు గల బయోమెట్రిక్‌ విశిష్ట సంఖ్య ఆధారంగా పౌరసత్వం గుర్తించవచ్చు. వ్యక్తిగత వివరాలతో పూర్తివివరాలు అంతా ఇందులో పొందుపరచబడి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది మనకు సిటిజన్ షిప్ కార్డు అన్నమాట. అయితే ఆ మధ్య కొన్నింటికి దీన్ని అనుసంధానం చేద్దామని ప్రయత్నించినప్పటికీ విమర్శలు రావటంతో కేంద్రం వెనక్కి తగ్గింది. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ ఆధార్ ఇప్పుడు అక్రమ సంబంధాలు బయటపడటానికి కారణమౌతుందంటే నమ్ముతారా? అయితే ఇది చదవండి.

చిత్తూరు జిల్లా ములకలచెరువుకు ఓ వివాహిత రేషన్ కోసం షాప్ కి వెళ్లగా, అక్కడ ఐదు కిలోల బియ్యం తగ్గింది. పాస్ లో తన భర్త పేరు కనిపించక పోవడంతో కోటా తగ్గిందని, అతని పేరుంటేనే బియ్యం ఇస్తానని డీలర్ చెప్పాడు. ఆ వెంటనే భర్త ఆధార్ నంబరుతో ఇంటర్నెట్ లో పరిశీలించగా, అతగాడి పేరు ఇంకో మహిళ పేరిట ఉన్న రేషన్ కార్డులో ఉన్నట్లు తెలిసింది. అసలు విషయ ఆరాతీయగా వ్యాపారం పేరుతో తరచూ బెంగళూర్ వెళ్తున్నానని చెప్పి ఆ దొంగమొగుడు పక్క ఊర్లో మరో కాపురం పెట్టాడంట. దీంతో మొగుడి మోసం తేలిసిన ఆమె లబోదిబోమంటోంది. ఒకే ఆధార్ సంఖ్య రెండు రేషన్ కార్డుల్లో ఉండకూడదనే నిబంధన ద్వారా కంత్రీ భర్త వ్యవహారం వెలుగుచూసింది. ఒక్క ములకలచెరువుతోలోనే కాదు, దుగ్గసానిపల్లె తదితర గ్రామాల్లోనూ ఇలాంటి రెండు సంసారాల వ్యవహారం ఆధార్ పుణ్యమాని బయటపడ్డాయంట.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chittoor  chittoor husband  illegal affair  Aadhaar  

Other Articles