ఏపీపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు | Purandeswari says Center always helps for AP Development

Purandeswari says center always helps for ap development

daggubati purandeswari, TDP, suresh prabhu, Rajyasabha seat, దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ, రాజ్యసభ సీటు, బీజేపీ, AP politics, political news, latest news, telugu news

ఏపీపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు | Purandeswari says Center always helps for AP Development

ఏపీపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Posted: 06/01/2016 03:09 PM IST
Purandeswari says center always helps for ap development

ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఓ కలగానే మిగులుతుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి తేల్చిచెప్పారు. గతంలోనే ఏపీతో సహా ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వదని చెప్పిన ఆమె ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని ధృవీకరించారు. విజయవాడలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఆ విషయాన్ని పక్కనబెట్టి ప్రస్తుతం ప్యాకేజీ విషయంపై దృష్టిసారించాలని టీడీపీ ప్రభుత్వానికి సూచించారు. నవ్యాంధ్రను బీజేపీ అన్ని విధాలా ఆదుకుంటుందని, ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తామన్న హామీకి కేంద్రం కట్టుబడి ఉందని ప్రకటించారు. పోలవరం విషయంలో నిధులను దశల వారీగా విడుదల చేసేందుకు సంబంధిత శాఖ నివేదిక సిద్ధం చేసిందని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను ఆయా ముఖ్యమంత్రులే పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.

కేంద్రమంత్రి సురేష్ ప్రభు రాజ్యసభ సీటు ఎంపికపై ఆమెను ప్రశ్నించగా, ఏపీ కోటాలో ఇవ్వాలని తామేమీ టీడీపీని కోరలేదన్నారు. సీటు కావాలని తాము కోరామా? లేదా? ఆఫర్ టీడీపీ నుంచే వచ్చిందా? అన్న విషయాలని తెలుగుదేశం వారినే అడిగి తెలుసుకోవాలని పురంధేశ్వరి చెప్పారు. ఏదీఏమైనా రైల్వే మంత్రి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. కాగా, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కోరినందుకే సురేష్ ప్రభుకు సీటు ఇచ్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daggubati purandeswari  TDP  BJP  AP special status  suresh prabhu  Rajyasabha seat  telugu news  

Other Articles