మహాలో భారీ పేలుడు... 17 మంది జవాన్ల మృతి | 17 killed in massive army depot fire in Maharashtra

17 killed in massive army depot fire in maharashtra

massive military ammunition depot, fire accident, Pulgaon, 17 army personnel, Wardha district, Smita Patil, నేషనల్ న్యూస్, జాతీయ వార్తలు, తాజా వార్తలు, flash news, national news, political news

A fire at a massive military ammunition depot in Pulgaon in Maharashtra has killed at least 17 army personnel and injured 19 others. The blaze began at 1:30 am at the depot in Pulgaon, near Nagpur, with television footage showing flames lighting up the night sky. "17 people have died. 19 are injured but are out of danger," said Smita Patil, superintendent of Wardha district police." An operation is in progress and the fire has been brought under control," she added.

ITEMVIDEOS: మహాలో భారీ పేలుడు... 17 మంది జవాన్ల మృతి

Posted: 05/31/2016 12:29 PM IST
17 killed in massive army depot fire in maharashtra

మహారాష్ట్రలోని వాద్రా జిల్లాలో మంగళవారం వేకువ ఝామున భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉన్నతాధికారులతోసహా 17 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. పుల్‌గావ్‌లోని భారత ఆర్మీ ఆయుధ డిపోలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. మరో 19 మంది గాయడపటంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయిస్తున్నారు.

కాగా, పుల్ గావ్ లోని ఈ ఆయుధ కర్మాగారం దేశంలోనే పెద్దది. భారత సైన్యానికి కావాల్సిన పేలుడు పదార్థాలను ఇక్కడి నుంచే సరఫరా అవుతాయి. అంతేకాదు కాలం చెల్లిన బాంబులను బాంబ్ స్క్వాడ్ సాయంతో ఇక్కడే నిర్వీర్యం చేస్తారు కూడా. ఈ ప్రమాదంలో కర్మాగారం పూర్తిగా నాశనం అయినట్లు తెలుస్తోంది. పేలుళ్లు ఇంకా కొనసాగుతుండటంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పక్క జిల్లాల నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కాసేపట్లో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించనున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఉగ్ర హస్తం ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మంటలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతుండటంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి భయానంకగా ఉంది. పరిస్థితి అదుపులోకి వచ్చాకే నష్టం పై ఓ అంచనాకి వచ్చే అవకాశం ఉంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pulgaon military ammunition depot  massive blast  17 army personnel died  

Other Articles