విజయ్ మాల్యాకు మన్మోహన్ సింగ్ గ్యారంటీ | This Manmohan Singh is Vijay Mallya's guarantor

This manmohan singh is vijay mallya s guarantor

manmohan singh, Vijay Malya, Kingfisher, మన్మోహన్ సింగ్, విజయ్ మాల్యా

After the Mumbai office of a nationalized bank identified him as a guarantor for business magnate Vijay Mallya, a local farmer from here has been allegedly deprived of banking facilities as well as all kinds of government-sponsored schemes after the bank froze his account. The farmer himself has no idea why officialdom has fallen on his life suddenly.

విజయ్ మాల్యాకు మన్మోహన్ సింగ్ గ్యారంటీ

Posted: 05/21/2016 04:21 PM IST
This manmohan singh is vijay mallya s guarantor

ప్రముఖ వ్యాపారవేత్త, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ వెళ్లిన విజయ్ మాల్యాకు మన్మోహన్ సింగ్ గ్యారంటర్ గా ఉన్నారట. అవును అంటే విజయ్ మాల్యా డబ్బు కట్టని పక్షంలో గ్యారెంటీగా మన్మోహన్ సింగ్ ఉన్నారన్న మాట. అయితే ఇప్పుడు విజయ్ మాల్యా దేశం వదిలివెళ్లాడు. దాంతో విజయ్ మాల్యా కట్టాల్సిన డబ్బును మన్మోహన్ సింగ్ ఎలాగూ కట్టలేడు.. అలాగని మన్మోహన్ సింగ్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు బ్యాంకు అదికారులు. దాంతో లబోదిబోమంటూ నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. ఇంతకీ మీరు అనుకుంటున్నట్లు మన్మోహన్ సింగ్ అంటే మాజీ ప్రధాని అనుకుంటున్నారేమో ఆయన కాదులెండి.

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన ఓ చిన్నకారు రైతు. విజయ్ మాల్యా తీసుకున్న అప్పుల్లో ఒకదానికి ఈ రైతు గ్యారంటర్‌గా ఉన్నట్లు గుర్తించిన బ్యాంకు.. ఈయన ఖాతాను ఫ్రీజ్ చేయించింది. ఇదేంటని అడిగితే, మాల్యా అప్పు తిరిగి చెల్లించేవరకు ఖాతా, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఉండవని చెప్పారు. మన్మోహన్‌ సింగ్‌కు 8 ఎకరాల భూమి ఉంది. అతడికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు ఖాతాలున్నాయి. ఆ రెండింటినీ ఫ్రీజ్ చేయాలని ముంబై హెడ్ ఆఫీసు నుంచి స్థానిక బ్రాంచికి ఆదేశాలు వచ్చాయి.దీంతో ఏం చేయాలో పాలుపోక మన్మోహన్ సింగ్ తల పట్టుకుని కూర్చున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles