ఆ ఒక్క చోట జయలలితకు దెబ్బ | jayalaitha facing troubles in that city

Jayalaitha facing troubles in that city

Tamilnadu, Kerala, Elections, Puducherry, Sreeshanth, Assam, BJP, Kerala, Vijaykanth, West Bengal, Jayalalitha, Karunanidhi, Mamata Banerjee, Oomen Chandi, తమిళనాడు, కేరళ, ఉమెన్ చాంది, కాంగ్రెస్ బిజెపి, పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు

Tamilanadu AIDMK leading in this elections. But in Chennai city Jayalalitha getting negetive results.

ఆ ఒక్క చోట జయలలితకు దెబ్బ

Posted: 05/19/2016 01:48 PM IST
Jayalaitha facing troubles in that city

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం అన్నాడిఎంకె స్పష్టమైన అధిక్యంతో దూసుకెళుతోంది. దీంతో వరుసగా రెండోసారి సిఎం పీఠాన్ని జయలలిత అధిష్టనున్నారు. కానీ చెన్నయ్ నగరంలో మాత్రం జయలలితకు ఎదురుదెబ్బ తగిలింది. చెన్నయ్ నగరంలో ఉన్న మొత్తం పదహారు స్థానాల్లో డిఎంకె పదకొండు స్థానాల్లో ఆధిక్యం సాధించింది. అన్నా డిఎంకె ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది. కోయంబత్తూరు జిల్లాలో అన్నాడిఎంకె హవా ఏకపక్షంగా కొనసాగుతోంది.

కోయంబత్తూరు జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉండగా, అన్నాడిఎంకె తొమ్మిది, డిఎంకె ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. మధురై జిల్లాలో మాత్రం అన్నాడిఎంకె ఆధిక్యం కనబరుస్తోంది. జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉండగా, అన్నాడిఎంకె ఎనిమిది, డిఎంకె రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. తిరుచిరాపల్లి జిల్లాలో డిఎంకె ఐదు, అన్నాడిఎంకె నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సేలం జిల్లాలో డిఎంకె చిరునామా గల్లంతైంది. జిల్లాలో మొత్తం పదకొండ స్థానాలు ఉండగా, అన్నాడిఎంకె పది, పిఎంకె ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. విల్లుపురం జిల్లాలో డిఎంకె ఆధిక్యం కనబరుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles