ఆ ఇంట్లో ప్రేతాత్మలు | Ghosts in that House

Ghosts in that house

Ghosts, Ghost, Srikakulam, దెయ్యాలు. ప్రేతాత్మలు

In Srikakulam dist in a house residents reveal that ghosts are living in their house for long years.

ఆ ఇంట్లో ప్రేతాత్మలు

Posted: 05/16/2016 10:31 AM IST
Ghosts in that house

ఓ ఇంట్లో తల్లీకూతుర్లు గత ఆరు నెలలుగా రోజూ చేస్తున్న పని అక్కడి వారందరికీ ఆశ్చర్యం కలిగించింది. రోజూ రాత్రి తలుపులు వేసుకొని. తెల్లారేసరికి బుట్టలు బుట్టల మట్టిని ఇంటి బయట వేస్తున్న ఈ తల్లీకూతుళ్ల గురించి తెలిస్తే షాకవుతారు. శ్రీకాకుళం మడ్డివీధిలో చాన్నాళ్లుగా మద్ది రమణమ్మ, ఆమె కుమార్తె దేవిక నివసిస్తున్నారు. రమణమ్మ.. ఇంటి తలుపులు రాత్రిపూట మూసివేసి ప్రతిరోజు ఉదయం మట్టి పారేయడాన్ని ఆరునెలల నుంచి స్థానికులు గమనిస్తున్నారు. ఇక ఆగలేక.. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి రమణమ్మ ఇంటిని పరిశీలించి నివ్వెరపోయారు.

తల్లీ కూతుళ్లు ఇద్దరూ కలిసి ఇంట్లో 30 అడుగుల మేర భారీగొయ్యి తవ్వి ఉంది. అలాగే ఇంటినిండా కాళీమాత చిత్రపటాలుండటంతో వారిని విచారించారు. తమ ఇంట్లో భూమిలోపల అస్థిపంజరాలున్నాయని, వాటిని బయటకు తీసి పడేస్తే.. ఇంట్లో దయ్యాలు, భూతాలు తిరగవని కలకత్తా కాళీమాత తమకు కలలో కనిపించి చెప్పిందన్నారు. ఇందుకోసం గొయ్యిని తవ్వుతున్నామని బావురుమన్నారు. అయితే వారి మానసికస్థితి బాగోలేదని గుర్తించిన పోలీసులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles