ఆ టైంలో ఇందిర, సోనియా పేకాట | Indira Gandhi and Sonia play cards at that time

Indira gandhi and sonia play cards at that time

Indira gandhi, PM, Sonia gandhi, KP Mathur, India pakistan War, Indiara Gandhi personal life, Unseen Indira Gandhi, ఇందిరాగాంధీ, ఇండియా, పాకిస్థాన్

According to a new book by Indira Gandhi's personal physician, KP Mathur, the day after the 1971 India-Pakistan war erupted, then prime minister was seen dusting the house. In his book, 'The Unseen Indira Gandhi', the 92-year-old physician narrates various anecdotes that he recalls from his 20-year association with Indira Gandhi.

ఆ టైంలో ఇందిర, సోనియా పేకాట

Posted: 04/29/2016 04:17 PM IST
Indira gandhi and sonia play cards at that time

దేశ సైన్యం ఓ పక్కన యుద్దం చేస్తుంటే ఆ దేశ ప్రధాని ఏమీపట్టనట్లు కూర్చెంటే ఎలా ఉంటుంది. నాటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ అలాగే కూర్చున్నారని తాజాగా ఓ పుస్తకంలో వెల్లడైంది. ఇందిరా గాంధీ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కేపీ మాథుర్ తాజాగా విడుదల చేసిన పుస్తకంలో అంశాల ఆధారంగా చూసుకుంటే ఇందిరాగాంధీ 1971 యుద్దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య 1971లో యుద్ధం చెలరేగే సమయానికి ఇందిరాగాంధీ ఇంట్లో దివాన్ మీద దుప్పటి మార్చుకుంటున్నారట. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేసిన మాథుర్ సుమారు 20 ఏళ్ల పాటు ఇందిరాగాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశారు. అప్పటి అనుభవాలను, పరిణామాలను ఆయన తన తాజా పుస్తకంలో రాశారు. 'ద అన్‌సీన్ ఇందిరాగాంధీ' అనే ఈ పుస్తకంలో అంశాల ఆధారంగా ఇందిరాగాంధీకి సంబంధించిన అనేక అంశాలు వెల్లడయ్యాయి.

1971, నవంబర్‌ 5న యుద్ధం మొదలైంది. మర్నాడు నవంబర్ 6న డాక్టర్‌ కేపీ. మాథూర్‌ అప్పటి ప్రధాని ఇందిర ఇంటికి వెళ్లారట. ఆప్పుడామె స్వయంగా బెడ్‌కవర్లు మార్చుతూ కనిపించారట. బహుశా ఈ పని ద్వారా ముందురోజు అర్థరాత్రి వరకు ఉన్న పని ఒత్తిడి నుంచి ఆమె బయటపడి ఉంటారని పుస్తకంలో పేర్కొన్నారు. యుద్ధం మొదలైన రోజు కూడా ఇందిర ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉన్నారని ఆయన తన పుస్తకంలో వెల్లడించారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేసిన మాథూర్ రెండు దశాబ్దాల పాటు ఇందిరా గాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశారు. అప్పటి అనుభవాలను తన 92 ఏళ్ల వయసులో ‘ది అన్ సీన్ ఇందిరాగాంధీ’ అనే పేరుతో పుస్తకం రాశారు.

1966లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఆమె తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారట. ప్రధానిగా బిజీగా ఉంటూనే శని, ఆదివారాల్లో ఏ మాత్రం వీలుదొరికినా.. పుస్తకాలు చదివేవారట. మధ్యాహ్న భోజనం ముగిశాక కొన్నిసార్లు పేకాట ఆడేవారని కూడా రాశారు. ఇందిరకు ధార్మిక భావాలు మెండని, అలాగే మూఢనమ్మకాలూ ఎక్కువేనని మాథుర్‌ పుస్తకంలో ప్రస్తావించారు. 'గురు ఆనందమయి మా' ఇచ్చిన రుద్రాక్ష మాలను ఆమె నిరంతరం ధరించేవారని, పలుమార్లు తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా వెళ్లారని మాథూర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. 1971 డిసెంబర్ మూడో తేదీన పాకిస్థాన్ యుద్ధం ప్రారంభించే సమయానికి ఇందిర కోల్‌కతాలో ఉన్నారట. వెంటనే ఢిల్లీకి వచ్చేసిన ఆమె యుద్ధం గురించి పెద్దగా టెన్షన్ ఏమీ పడలేదని, యుద్ధవ్యూహాలు, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించే ఆలోచించేవారని మాథుర్ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles