ఆ చిన్నోడి పేరు కథ వింటే షాక్ | Woman gives birth on Jetstar plane, names baby after airline

Woman gives birth on jetstar plane names baby after airline

Jet Star, Woman, Australia, bith in Plane, baby Boy birth in flight, జెట్ స్టార్, ఆస్ట్రేలియా, విమానం

A pregnant woman who unexpectedly gave birth on a flight has named her new baby after the airline, Jetstar. Saw Ler Htu was flying on Friday from Singapore to Myanmar on the budget airline when she went into labour and delivered a baby boy, with the help of the crew and three doctors who were also on board.

ఆ చిన్నోడి పేరు కథ వింటే షాక్

Posted: 04/28/2016 11:46 AM IST
Woman gives birth on jetstar plane names baby after airline

ఈ మధ్యన పిల్లలకు వెరైటీ వెరైటీ పేర్లు పెడుతున్నారు. చింటూ, బంటీ దగ్గరి నుండి రకరకాల పేర్లు పెడుతున్నారు. ఊర్ల పేర్లు, ప్రదేశాల పేర్లు ఇప్పటికే చాలా మంది పెట్టి ఉంటారు. కానీ తాజాగా ఓ చిన్నారికి పెట్టిన పేరు సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఓ మహిళ తాను ప్రయాణిస్తున్న విమానంలోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ బాబుకు తాను ప్రయాణించిన విమానం పేరునే పెట్టుకుంది ఆ తల్లి. ఈ ఘటన ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో జరిగింది.

సాలర్ అనే గర్భిణి జెట్‌ స్టార్ విమానంలో మయన్మార్ వెళుతుండగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే విమాన సిబ్బంది , వైద్యులు ఆమెకు విమానంలోనే పురుడు పోశారు. పండంటి బాబు పుట్టడంతో సాలర్ తన కొడుకుకు జెట్‌స్టార్ అనే పేరు పెట్టుకుంది. ఈ విషయాన్ని ఎయిర్‌ లైన్స్ సిబ్బంది సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆస్ట్రేలియా జాతీయ ఎయిర్‌లైన్ సంస్థ అయిన కాంటాస్ గర్భిణులకు విమానంలో నాలుగు గంటలట వరకు ప్రయాణించడానికి అనుమతి ఇస్తోంది. సలార్‌కి విమానంలోనే నొప్పులు రావడంతో ప్రయాణికులు కాసింత కంగారుపడ్డారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. సమయస్పూర్తితో వ్యవహరించిన విమాన సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles