When BJP MP Maneka Gandhi lauded Sonia Gandhi, cited her example on how to curb corruption

Union minister lauds sonia gandhi on how to curb corruption

Union Cabinet Minister for Women and Child Development maneka gandhi, congress president sonia gandhi, Maneka Gandhi, Sonia Gandhi, BJP, Congress, corruption, nepotism, pilibit, curbing corruption

Congress president Sonia Gandhi has received a rare praise, Union Cabinet Minister Maneka Gandhi cited Sonia Gandhi's example on how to curb corruption and discourage nepotism,

అక్రమాలపై సోనియా బాటలో మేనకగాంధీ

Posted: 04/26/2016 11:25 AM IST
Union minister lauds sonia gandhi on how to curb corruption

తోటికోడళ్లు అనగానే ఏ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందని పెద్దలు తరతరాలుగా చూసిన అనుభవ పాఠాలు చెబుతున్న సత్యం. అయితే వారిద్దరి మధ్య ఈ సంబంధం ఎలా వుందో తెలియదు కానీ, మొత్తానికి కేంద్ర మంత్రి మేనకా గాంధీ తన తోటి కొడలు సోనియాగాంధీని పొగుడుతూ.. అమె బాటలో పయనించాలని అధికారులకు సూచించారు. సోనియాగాంధీని ఫాలో కావాలా..? అంటూ ఆశ్చర్యపోయేవాళ్లు లేకపోలేరు.. అయితే ఇంతకీ ఇదంతా ఏ విషయంలో అంటే.. అక్రమాలను అరికట్టే విషయంలోనట. ఈ విషయంలో ఆక్క సోనియాను అనుసరించాలని అమె పిలుపునివ్వడం బీజేపి శ్రేణులను మిమాంసలో పడేసింది. అక్రమాలను అరికట్టేందుకు సోనియాగాంధీ బాటలో నడవాలని మేనక ఉన్నతాధికారులను ఆదేశించారు. అసలేం జరిగిందంటే..

కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆదివారం తన సొంత నియోజకవర్గం ఫిలిబిత్(యూపీ)లో పర్యటన సందర్భంగా పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో.. కొందరు ఐఏఎస్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నరని, లంచాలు తీసుకుని ప్రైవేటు స్కూళ్లకు ఇష్టారీతిగా అనుమతులు, గుర్తింపులు మంజూరుచేస్తున్న విషయాన్ని ఇతర అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. సదరు కరప్టెడ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకునే పవర్ తమకు లేనందున, మీరే ఏదో ఒకటి చెయ్యాలని మంత్రిని కోరారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని వారితో కఠినంగా వ్యవహరించాలని అమె అదేశించారు. ఐఏఎస్ లపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేకపోయినా.. వాళ్ల ఆగడాలను కచ్చితంగా అడ్డుకోగలమని ధీమాను వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తానొక ఉదాహరణ చెప్తానని తన తోటి కొడలు ఇలాంటి విషయంలో తీసుకున్న చర్యలపై అమె సమీక్షా సమావేశంలో ఉదహరించారు. మా అక్క సోనియా గాంధీ దగ్గరి బంధువు ఒకరు ఆ మధ్య ఓ షాప్ ప్రారంభించాడు. అప్పుడు అధికారంలో వున్న యూపీఏ ప్రభుత్వాన్ని తన వ్యాపార వృద్దికి వాడుకున్నాడు.

తెలిసినవాళ్లకు, తెలియని వాళ్లకు తాను సోనియా గాంధీ బంధువునంటూ బాజా వేసుకుని, తద్వారా లబ్ధి పొందాలని చూశాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కయ్య.. వెంటనే అతని చర్యలను ఖండిస్తూ పేపర్లలో ప్రకటనలిచ్చింది. దెబ్బకి అతని రోగం కుదిరింది. మీరు కూడా అదే మాదిరిగా అవినీతిని రూపుమాపేందుకు ప్రకటనలు ఇవ్వండి' అని సూచించారు. ఎలాంటి పనికైనా, ఎవ్వరికైనాసరే లంచం ఇవ్వొద్దని నోటీస్ బోర్డుల్లో రాయాడమేకాక అందరు అధికారుల ఆఫీసుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, తద్వారా అక్రమాలను అడ్డుకోగలమని మేనకా గాంధీ పేర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonia gandhi  meneka gandhi  corruption  nepotism  Pilibhit  

Other Articles