Non-bailable warrant against central minister Sujana Chowdary

Non bailable warrant against central minister sujana chowdary

Court, NonBailable warrant,Sujana Chowdary, Nampally court

Court issued non-bailable warrants against central minister Y.S. Chowdary in a case filed by a Mauritius-based bank for alleged default of repayment of loan. The 12th additional chief metropolitan magistrate issued the warrant as the minister failed to personally appear for the third time in response to the summons issued earlier by the court.

సుజనా చౌదరికి నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంట్

Posted: 04/08/2016 10:44 AM IST
Non bailable warrant against central minister sujana chowdary

కేంద్ర మంత్రి, టిడిపి పార్టీలో కీలకనేతగా ఎదిగిన సుజనా చౌదరికి చిక్కెదురైంది. తాజాగా నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మారిషస్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్‌కు (ఎంసీబీ) బకాయిల చెల్లింపు వ్యవహారంపై దాఖలైన కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనతోపాటు సుజనా గ్రూప్‌కు చెందిన పలువురు ప్రతినిధులకు 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేశారు. రూ.106 కోట్లు మేర బకాయిపడిన సుజనా యూనివర్సల్ లిమిటెడ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎంసీడీఎల్ ప్రతినిధులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై పలుమార్లు కోర్టు విచారించింది. కోర్టు విచారణకు సుజనాచౌదరితోపాటు సంస్థ ప్రతినిధులు హాజరుకాకపోవడంతో కోర్టు సమన్లు జారీచేసింది. ఆ తర్వాత మూడుసార్లు జరిగిన విచారణకూ సుజనాచౌదరి హాజరు కాలేదు. తాజాగా ఏప్రిల్ ఒకటో తేదీన జరిగిన విచారణకు కూడా ఆయన హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. కాగా గతంలో మాత్రం తనకు ఎలాంటి కోర్టు ఉత్తర్తులు జారీ కాలేదని అన్నారు. సుజనా ప్రజాపరిపాలనలో బిజీ ఉన్నాడని... కాబట్టి కోర్టుల చుట్టూ తిరిగే టైంలేదని వేరే వాళ్లతో అన్నట్లు వార్తలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Court  NonBailable warrant  Sujana Chowdary  Nampally court  

Other Articles