Court sent Muzammil Ansari to jail for the rest of his lifetime.

Court sent muzammil ansari to jail for the rest of his lifetime

Mumbai Blast, Court, POTA, Malik Khot, Abdul Ansari

The main accused in the Mumbai triple blasts, which took place between 2002 and 2003, has been sentenced to life imprisonment. A Special Prevention of Terrorism Act (POTA) court sent Muzammil Ansari to jail for the rest of his lifetime.Other accused Farhan Malik Khot and Dr Wahid Abdul Ansari were also sentenced to life imprisonment. SIMI operative Saquib Nachan was pronounced 10 years imprisonment.

ముంబై పేలుళ్ల కేసులో 10 మందికి శిక్ష ఖరారు

Posted: 04/06/2016 01:35 PM IST
Court sent muzammil ansari to jail for the rest of his lifetime

ముంబైలో జరిగిన పేలుళ్ల కేసులో ఉగ్రవాద నిరోధక చట్టం-పోటా కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ప్రధాన నిందితుడు అన్సారీకి జీవిత ఖైదు విధించింది. మరో తొమ్మిది మంది నిందితులకు పదేళ్ల శిక్ష ఖరారు చేసింది. మొత్తం 15 మంది నిందితుల్లో విచారణ సమయంలోనే ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. 2002 డిసెంబర్- 2003 మార్చి మధ్య ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ములుంద్, విలే పార్లే, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లలో జరిపిన పేలుళ్లలో 13 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఈ మూడు పేలుళ్లపై దాఖలు చేసిన సంయుక్త చార్జిషీట్ పై కోర్టు విచారణ జరిపింది.

2003 మార్చి 13న ములుంద్ దగ్గర రైలులో జరిపిన పేలుడులో 12 మంది చనిపోయారు. 71 మంది గాయపడ్డారు. 2003 జనవరి 27న విలే పార్లే మార్కెట్ లో సైకిల్ కు అమర్చి బాంబు పేల్చిన ఘటనలో ఒకరు చనిపోయారు. 2002 డిసెంబర్ 6న ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో జరిపిన పేలుడులో పలువురు గాయపడ్డారు. అయితే గత ఏళ్ల తరబడి నడిచిన ఈ కేసులొ కోర్టు తీర్పు వెలువడింది. కాగా న్యాయం ఆలస్యంగా జరిగినా అది న్యాయం అనిపించుకోదు అని సుప్రీంకోర్టు గతంలోనే తెలిపింది. కానీ రకరకాల కారణాల వల్ల కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి నడుస్తూనే ఉన్నాయి.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Blast  Court  POTA  Malik Khot  Abdul Ansari  

Other Articles