Petrol Price Hiked by Rs 2.19/Litre, Diesel by 98 Paise/Litre

Petrol price hiked by rs 2 19 a litre diesel by 98 paise

Petrol price, Diesel price, Petrol, Diesel, Crude oil price, Fuel prices, petrol price hike, diessel price hike, oil companies, petroleum ministy

Petrol price was on Monday raised by Rs 2.19 per litre while diesel rate was increased by 98 paise per litre.

పెట్రో బాంబు: అంతర్జాతీయంగా తటస్థం.. దేశంలో పెంపు అనివార్యం

Posted: 04/04/2016 07:32 PM IST
Petrol price hiked by rs 2 19 a litre diesel by 98 paise

అంతర్జాతీయ మార్కెట్ లో లభ్యమయ్యే చముర ధరలకు అనుగూణంగా దేశంలో ఇందన ధరలను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణను వదులుకున్న కేంద్రం.. ఈ మేరకు ఇంధన సంస్థలకు అధికారాలను ఇచ్చింది. నెలకు రెండు పర్యాయాలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగూణంగా సమీక్షించుకుని ధరల పెంపును అప్పటి నుంచి అయిల్ కంపెనీలు నిర్వహిస్తున్నాయి, గత యూపీఏ ప్రభుత్వ హయాంలోని చివరి అంకంలోనూ అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 115కు పైబడే వుండింది,

దేశంలో తన ఉనికిని చాటుకుని అంతకుముందు ముఫ్సై ఏళ్లుగా లేని ఏకపక్ష మోజారిటీతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం కోలువుదీరడంతోనే అంతర్జాతీయంగా కూడా పరిణామాలు అంతకంతకు దిగజారి చమురు ధరలు ఒకనోక ధశలో ఏకంగా 33 డాలర్లకు పడిపోయాయి, అయితే ఈ మార్పులకు అనుగూణంగా అటు కేంద్రంగానీ, ఇటు చమురు సంస్థలు కానీ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదన్న వాదనలు కూడా వున్నాయి. సరికదా, అనుకుంటే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విలువ ఆధారిత పన్నులను పెంచాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే వాహనదారులు తీవ్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చిదంబరం కూడా ఈ విషయమై కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకు, దేశంలో సాగిస్తున్న అమ్మకాలకు పొంతన లేదని అరోపించారు. ఇంధన ధరలపై కేంద్రం ఆర్జించిన లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

అయినా తాజగా కేంద్ర ప్రభుత్వం మరోమారు పెట్రో బాంబు పేల్చింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 2.19 పైసలు పెంచగా, లీటరు డీజిల్ ధర 98 పైసలు పెరిగింది. పెంచిన పెట్రోల్ కొత్త ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్ ధర పెంచేందుకు ఆయిల్ కంపెనీలకు అనుమతినిచ్చి ప్రజలపై ప్రభుత్వం భారం మోపింది. దీంతో పెట్రోల్ వాహనదారులందరిపై పెనుభారం పడనుంది. పెట్రోల్ ధరల పెంపుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే సమయం వరకు ఇంధన ధరలను పెంచుకుంటూ వెళ్తున్న కేంద్రం, ఎన్నికల సమయంలో ధరలను రమారమి సగానికి తగ్గించి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి,

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol price  diesel prices  hike  oil companies  petroleum ministy  

Other Articles