Devotees celebrating Shivarathri

Devotees celebrating shivarathri

Shivarathri, Shiva, Devotees, Srisilum, Lord Shiva

Devotees celebrating Shivarathri . devotees going to Shiva temples to get blessings of Lord Shiva.

దేశవ్యాప్తంగా ఘనంగా శివరాత్రి

Posted: 03/07/2016 09:23 AM IST
Devotees celebrating shivarathri

దేశవ్యాప్తంగా హిందు భక్తులు మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ శివాలయాలు ‘ ఓం నమః శివాయ’ ‘హరహరమహాదేవ’ నినాదాలతో మార్మోగుతున్నాయి.
మహాశివరాత్రి వేడుకలతో శైవక్షేత్రాలు వెలిగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తుండతో... ఆలయాలన్నీ రద్దీగా మారుతున్నాయి. రాత్రి జాగరణ చేసేందుకు పలు ఆలయాల్లో ప్రత్యేక
భజనలు, భక్తిగీతాలపన కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. శివపార్వతుల కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సుప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పెద్దఎత్తున
పోటెత్తారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలునిర్వహిస్తున్నారు.

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మల్లికార్జునుడు దేవేరి భ్రమరాంబతో కలిసి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం నిర్వహించిన
గ్రామోత్సవంలో.... గజవాహన సమేత ఉత్సవ మూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం ప్రధాన రాజగోపురం నుంచి రథశాల వద్దకుచేర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ గ్రామోత్సవంలో లక్షలాది మంది
భక్తులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivarathri  Shiva  Devotees  Srisilum  Lord Shiva  

Other Articles