Actor Kalabhavan Mani passes away

Actor kalabhavan mani passes away

Actor, Kalabhavan Mani, Gemini cinema

South Indian Multi talented star actor kalabhavan Mani passes away. He is suffering with lungs infection

నటుడు కళాభవన్ మణి ఇకలేరు

Posted: 03/07/2016 07:04 AM IST
Actor kalabhavan mani passes away

తెలుగులొ వెంకటేష్ జెమిని సినిమా ద్వారా విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కళాభవన్ మణి ఇకలేరు. దక్షిణాది సినీరంగంలో వైవిధ్య భరితమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ గా కళాభవన్ కు గుర్తింపు ఉంది. . ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. కోచిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. కళాభవన్ మృతిపై దక్షిణా ది చిత్ర పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణి1971 జనవరి 1న జన్మించారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తూనే.. కేరళలో గొప్ప కళాకారులను అందించిన కళాభవన్‌లో మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ కళాభవన్ పేరునే ఇంటిపేరుగా చేసుకున్నారు.

హాస్య నటుడిగా అక్షరం సినిమాతో మలయాళ సినీరంగానికి పరిచయమైన మణి.. వాసంతియుం లక్ష్మీయం పిన్నె న్యానమ్ చిత్రంలో అంధ వీధి గాయకుడిగా అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఆ చిత్రంలో ఆయన నటనకు జాతీయస్థాయిలో ప్రత్యేక ప్రశంస అవార్డుతోపాటు, పలు అవార్డులను అందుకున్నారు. జెమిని చిత్రంలో విలన్ లడ్డా పాత్రలో మణి ప్రదర్శించిన నటన, హావభావాలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. జెమిని చిత్రం తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ విలన్లలో ఒకరిగా మారారు. తెలుగులో ఎవడైతే నాకేంటి, నరసింహుడు, అర్జున్‌తోపాటు పలు చిత్రాల్లో నటించారు. ఆయన మంచి నటుడే కాకుండా గాయకుడు, సంగీత దర్శకుడు కూడా. 25కుపైగా చిత్రాల్లో పాటలు పాడారు. మలయాళం, తమిళం, తెలుగులో 200 చిత్రాలకుపైగా నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor  Kalabhavan Mani  Gemini cinema  

Other Articles