Bonthu Rammohan to be first Mayor of Hyd in T state

Bonthu rammohan to be first mayor of hyd in t state

Bonthu Rammohan, Hyderabad, GHMC, mayor, Fasiuddin

As expected, the TRS Youth Wing President and newly elected Corporator from Cherlapally Division Bonthu Rammohan is going to occupy the prestigious Mayor seat on Thursday. Rammohan is becoming the first Mayor of the Hyderabad City after the formation of separate Telangana state.

మేయర్ గా బొంతు రామ్మోహన్, ఫసియుద్దీన్ డిప్యూటీ

Posted: 02/11/2016 09:08 AM IST
Bonthu rammohan to be first mayor of hyd in t state

జిహెచ్ఎంసీ మేయర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠకు తెర పడింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు ఇద్దరు యువ నేతలనే వరించాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనటంతో పాటు పార్టీకి విధేయులుగా ఉన్న బొంతు రామ్మోహన్‌, బాబా ఫసియుద్ధీన్ లను మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎంపిక చేస్తూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. జిహెచ్‌ఎంసీ మేయర్ గా చర్లపల్లి డివిజన్‌ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్ గా బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు. బల్దియా అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.

బొంతు రామ్మోహన్‌ టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో రామ్మోహన్ పై మొత్తం 142 కేసులు నమోదయ్యాయి. సీఎం కేసీఆర్ కు అత్యంత నమ్మకస్థుడిగా ఆయన పేరు పొందారు. బల్దియా ఎన్నికల్లో పోటీ చేయాలని రామ్మోహన్‌ ముందుగా భావించకపోయినా టీఆర్ఎస్ నాయకత్వం చివరి నిమిషంలో అతనితో నామినేషన్‌ వేయించింది. కాగా.. డిప్యూటీ మేయర్‌ పదవి చేపట్టనున్న ఫసియుద్దీన్‌ టీఆర్ఎస్ నేతలకు ఇష్టమైన విద్యార్థి నాయకుడు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం హైదరాబాద్‌ నగర అధ్యక్షుడిగా ఫసియుద్దీన్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు అరెస్టయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు బోరబొండ నుంచి పోటీకి దిగి ఘన విజయం సాధించారు. మైనార్టీకి పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో పాటు నమ్మకస్థుడిగా ఉండటంతో సీఎం ఫసియుద్దీన్ వైపే మొగ్గుచూపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bonthu Rammohan  Hyderabad  GHMC  mayor  Fasiuddin  

Other Articles