Patiala woman thrashes gas agency worker over ‘vulgar’ talk

Patiala woman thrashes gas agency worker over vulgar talk

Patiala, Punjab, Wonam, Harrasment

A video of a woman and her husband thrashing a gas agency worker went viral on the social media on Friday, a day after the worker harassed the woman when she had called the gas agency to book a cylinder.

ITEMVIDEOS: చెప్పుతో చెంప ఛెళ్లు.. పోలీస్ స్టేషన్ వరకు బడితపూజ

Posted: 02/06/2016 01:27 PM IST
Patiala woman thrashes gas agency worker over vulgar talk

వెక్కిలి వేషాలే వేసే వాళ్లకు.. దిమ్మతిరిగేలా బుద్ది చెప్పకపోతే ఎలా అనుకున్న ఓ మహిళ.. ఆకతాయికి బడిత పూజ చేసింది. పటియాలాలో ఓ మహిళను వేధిస్తున్న ఆకతాయికి తగిన గుణపాఠం చెప్పింది. గ్యాస్ సిలిండర్ కోసం ఫోన్ చేసిన మహిళతో అసభ్యంగా మాట్లాడిన యువకుడు ఆమెను వేధించారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా... చివరకు సెక్స్ గురించి మాట్లాడాడు. ఫోన్ ఆమె లిఫ్ట్ చెయ్యకపోతే మాటిమాటికి ఫోన్లు చేశాడు. తాను వివాహితనను, తనకు కుటుంబం ఉందని అన్నా కూడా వాడు మాత్రం ఊరికే ఉండలేదు.

పటియాలాకు చెందిన ఓ మహిళ తన ఇంటి అవసరాల కోసం గ్యాస్ సిలిండర్ బుక్ చేద్దామని అనుకొని ఫోన్ చేసింది. అవతల ఫోన్ ఎత్తిన వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఫోన్ కు తిరిగి ఫోన్ చేసిన అతడు.. బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో వాడికి బుద్ది చెప్పాలనుకున్న ఆమె.. తన కుటుంబ సభ్యులతో జరిగిన విషయం చెప్పింది. వారి సహాయంతో వాడిని ఓ చోటుకు రప్పించి.. అక్కడి వాడిని పట్టుకుని చెప్పుతో బుద్ది చెప్పింది. అలా చెప్పుతో కొట్టుకుంటూనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లింది. పోలీసుల ముందు కూడా ఆమె వాడిని వాయించింది. అయితే వాడి మీద కేసు పెట్టకుండా.. వదిలిపెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patiala  Punjab  Wonam  Harrasment  

Other Articles