Kejriwal got DD for shoes

Kejriwal got dd for shoes

Arvind Kejriwal, Delhi, shoes, Delhi CM, Arvind, DD, Arvind Kejriwal got DD for Shoes

Embarrassed" by Delhi CM Arvind Kejriwal wearing sandals during a banquet at Rashtrapati Bhavan, a businessman from Visakhapatnam has sent him Rs 364 and requested him to buy a pair of formal, closed shoes with it. Kejriwal was spotted wearing sandals during a banquet at Rashtrapati Bhavan hosted in honour of French President Francois Hollande.

ఆ సిఎంకు షూ కొనడానికి కూడా డబ్బులు లేవా.?

Posted: 02/04/2016 06:04 PM IST
Kejriwal got dd for shoes

ఓ రాష్ట్రానికి సీఎం కానీ పాపం షూ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడంతో ఓ మహానుభావుడు అతడి షూ కోసం డిడి తీసి పంపించారు. అవును... మీరు చదువుతున్నది అక్షరాల సత్యం. సిఎంకే డబ్బులు లేకపోతే ఆయనకు డబ్బులు డిడి రూపంలో పంపించడం వార్తల్లో నిలిచింది. ఇంతకీ పాపం ఆ నిరుపేద సిఎం ఎవరో తెలుసా..? దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్. అవును ప్రధాన మంత్రి కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్న ఆయనకు డబ్బులు పంపించడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.


జనవరి 26 గణతంత్ర దినోత్సవ అతిధిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సువా హొలాందేకు రాష్ట్రపతిభవన్‌లో ఆహ్వానం పలికిన సందర్భంగా కేజ్రీవాల్ చెప్పులు వేసుకుని రావడం సుమీత్ అగర్వాల్‌కు నచ్చలేదు. పైగా అది డ్రెస్ కోడ్‌ను, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమేనని గతంలో రాష్ట్రపతి నారాయణన్ విడుదల చేసిన సర్క్యులర్‌ను కూడా డిడికి జత చేసి పంపాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశానికి ప్రతినిధిగా వెళ్లినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నాకు వెళ్లినట్లుగా వెళ్లడం సరికాదని సుమిత్ సూచించాడు. పబ్లిక్ స్టంట్‌లు మానుకోవాలంటూ సుమీత్ బహిరంగ లేఖ కూడా రాశాడు. దేశానికి ప్రతినిధులుగా వెళ్తున్నప్పుడు వ్యక్తిగత అహాలు తగవని సూచించాడు. వైజాగ్‌లో జరుగుతోన్న నేవీ సంబరాల్లో పాల్గొనేందుకు పలు దేశాల ప్రతినిధులు కూడా హాజరౌతున్నారని, ఆహ్వానం అంది వచ్చేలా ఉంటే పొరపాటున కూడా చెప్పులు వేసుకురావద్దని సుమీత్ అగర్వాల్ కేజ్రీవాల్‌ను కోరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Delhi  shoes  Delhi CM  Arvind  DD  Arvind Kejriwal got DD for Shoes  

Other Articles