Court says man must tell police if he is going to romance

Court says man must tell police if he is going to romance

court, Romance, Rape

A man has been given a court order to inform police 24 hours before any physical contact with a woman, despite being cleared of rape. Magistrates in York said the man, who cannot be named for legal reasons, was also subject to restrictions online and is required to declare to police any phone he has that is capable of accessing the internet, calling or texting people.

సెక్సు చెయ్యాలంటే కోర్టు అనుమతి

Posted: 01/24/2016 12:34 PM IST
Court says man must tell police if he is going to romance

సెక్సు చెయ్యాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలంట.. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. సెక్స్ చెయ్యాలనుకుంటే ఒక రోజు ముందుగానే కోర్టుకు వివరాలు సమర్పించాలంటూ వెరైటీ తీర్పునిచ్చింది. ఎవరితో అతడు సెక్స్ చెయ్యాలనుకుంటున్నాడో వాళ్ల వివరాలు పోలీసులకు ముందే వెల్లడించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఎవరితో సెక్స్ చేస్తున్నాడో ఆ అమ్మాయి ఫుల్ డిటేల్స్ అంటే పుట్టిన తేదీ, ఈ-మెయిల్ అడ్రస్ లాంటి వివరాలను కచ్చితంగా అందజేయాలట! ఒకవేళ సమాచారం ఇవ్వకుండా, పర్మిషన్ లేకుండా శృంగారంలో పాల్గొంటే అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇదేం తీర్పు అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి మీకే అర్థమవుతుంది.

2015లో ఓ నలభై ఏళ్ళ వ్యక్తి ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదైంది. తాజాగా ఈ అత్యాచారం కేసు కోర్టులో విచారణకు వచ్చింది. నార్త్ యార్క్ షైర్ లోని నార్త్ అలర్టన్ మేజిస్ట్రేట్ అతడికి నాలుగు నెలల పాటు ఓ శిక్ష విధించారు. ఆ వ్యక్తి శృంగారంలో పాల్గొనాలనుకుంటే ఒక రోజు ముందే తమకు వివరాలు తెలపాలని న్యాయమూర్తి సూచించారు. అందరిలాగా అతను తనకు నచ్చిన ఏ మహిళతో అయినా శృంగారంలో పాల్గొనవచ్చు. కానీ, సెక్స్ చేయాలని అతడు భావించినప్పుడు కచ్చితంగా 24 గంటల ముందే పోలీసులకు వివరాలందించాలని తీర్పు ఇచ్చారు

2015 మార్చిలో వచ్చిన కొన్ని నూతన చట్టాలు ఇలాంటి తీర్పునకు ఊతమిస్తున్నాయి. ఏ వ్యక్తి నుంచి అయినా మహిళలకు సెక్స్ పరమైన ఇబ్బందులు, వారిపై అత్యాచార దాడులు జరగవచ్చని భావిస్తే అలాంటి వారికి ఈ శిక్ష విధించవచ్చని ఇంగ్లండ్ నూతన చట్టాల్లో పేర్కొన్నారు. అంతే కాకుండా నిందితుడు వాడుతున్న సెల్ ఫోన్ వివరాలు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంటర్నెట్-లో ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నాడు తదితర అంశాలపై కూడా ఆంక్షలు విధించారు. వినడానికి కాస్త వింతగానే ఉన్నప్పటికీ ఇంగ్లండ్, వేల్స్ లలో ఇలాంటి చట్టాలను గత సంవత్సరం అమలులోకి తీసుకు వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : court  Romance  Rape  

Other Articles