Saudi Arabia executes 47 terrorism convicts

Saudi arabia executes 47 terrorism convicts

Saudi Arabia, Hang, 47 criminals hanged in Saudi

The Saudi Interior Ministry on Saturday said 47 people convicted of plotting and carrying out terrorist attacks, targeting civilians and security forces, were executed. The Ministry statement, published on the official SPA news agency, said the 47 had been convicted of adopting the radical “takfiri” ideology, joining “terrorist organizations” and implementing various “criminal plots.”

సౌదీలో ఒకేసారి 47 మందికి ఉరి

Posted: 01/02/2016 04:06 PM IST
Saudi arabia executes 47 terrorism convicts

అరబ్ దేశాల్లో అందులోనూ ముఖ్యంగా సౌదీ అరేబియాలో అయితే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తప్పు చేసింది ఎవరు అయినా కానీ ఎలాంటి తాత్సారం లేకుండా శిక్ష విధించడం జరుగుతుంది. అయితే తాజాగా ఒకేసారి 47 మందికి ఉరిశిక్ష అమలు చెయ్యడం సంచలనం రేపింది. సౌదీ అరేబియాలో షీయా మతనాయకుడు షేక్ నిమ్ర్ అల్ నిమ్ర్  తో సహా 47 మందికి ఉరిశిక్ష అమలు చేశారు. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడినందుకు  వీరందరినీ  ఉరితీసినట్లు  సౌదీ హోం  మంత్రిత్వశాఖ ప్రకటించింది. షియా కమ్యునిటీ మతనాయకుడైన  షేక్ నీమ్ర్  2011లో  ఈస్టర్న్‌ ప్రావిన్స్ లో  ప్రభుత్వ వ్యతిరేక నిరనలకు మద్దతుగా పలు ప్రసంగాలు చేశారు. రెండేళ్ల క్రితం  ఆయనను అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నుముట్టాయి.  దీంతో  సౌదీ ప్రభుత్వం కేసుపెట్టింది.

కోర్టు  గత అక్టోబర్ లో  షేక్ నిమ్ర్ –కు  మరణశిక్ష విధించింది.  రాజ్యద్రోహం కేసులో ఆయనను దోషిగా నిర్ణయించారు.  పాలకులను ఆదేశాలను అలక్ష్యం చేయడంతో పాటు భద్రతా  దళాలపై ఆయుధాలు ప్రయోగించిన నేరాల్లో షేక్ ను దోషిగా నిర్థారించారు.  సౌదీలో  సున్నీ పాలన సాగుతుంటే.. షియాలు అధికారంలో ఉన్న  ఇరాన్ ఇప్పటికే..  షేక్ విషయంలో  హెచ్చరికలు జారీ చేసింది.  షియా నేతకు ఉరి శిక్ష అమలు వల్ల సౌదీ భారీ మూల్యం చెల్లించవలసివస్తుందని  ఇరాన్ హెచ్చరించింది.  షేక్ తో పాటు 47 మందికి ఉరిశిక్ష అమలు చేశారు. వారిలో కంబోడియా, ఈజిప్ట్ కు చెందిన ఇద్దరు పౌరులు ఉన్నారు. మిగతావారంతా సౌదీ పౌరులే. సౌదీ  నిరుడు 150 మందికి పైగా వ్యక్తులను ఉరి తీసింది.20 ఏళ్లలో ఇంత పెద్దఎత్తున మరణ శిక్ష అమలు ఇదే ప్రథమం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi Arabia  Hang  47 criminals hanged in Saudi  

Other Articles