Rajasthan green marble fountain adds to beauty of Afghan Parliament

Rajasthan green marble fountain adds to beauty of afghan parliament

Rajasthan green marbles, green marble fountain, Afghan Parliament, Kabul, Udaipur

There is an element of Rajasthan in the new parliament building of Afghanistan in Kabul. The building was recently inaugurated by Prime Minister Narendra Modi. The Rs 710-crore building which has been built by the the central public works department (CPWD) has a fountain made of green marble from Udaipur.

ITEMVIDEOS: ఆప్ఘన్ పార్లమెంట్ వద్ద రాజస్థాన్ మార్బల్స్ అందాలు

Posted: 12/30/2015 10:56 AM IST
Rajasthan green marble fountain adds to beauty of afghan parliament

రాజస్థాన్ మార్బల్స్ అందాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల్లో కూడా రాజస్థాన్ అందాల చర్చ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే తాజాగా రాజస్థాన్ మార్బల్స్ ఇక మీదట మన దగ్గరే కాదు ఆప్ఘనిస్థాన్ కు వెళ్లినా కానీ కనిపిస్తాయి. అదేంటి రాజస్థాన్ అందాలు ఆప్ఘనిస్థాన్ లో కనిపించడం ఏంటీ అనుకుంటున్నారా.? కొత్తగా నిర్మించిన ఆప్ఘన్ పార్లమెంట్ భవనం దగ్గర ఏర్పాటు చెయ్యనున్న ఓ ఫౌంటేన్ మన రాజస్థాన్ లోనే తయారుచేసింది. గ్రీన్ ఫౌంటేన్ అందాలను ఇక మీదట ఆప్ఘనిస్థాన్ లో కూడా చూడవచ్చు. రాజస్థాన్ కీర్తి పతాకాలను ఆప్ఘనిస్థాన్ లోనూ చాటారు అక్కడి కళాకారులు.

{youtubre}C4VuQYkjcag|620|400|1{/youtube}

ఆప్ఘనిస్థాన్ కు, భారత్ కు ముందు నుండి మంచి సంబందాలు ఉన్నాయి. గతంలో రాజుల కాలం నుండి కూడా రెండు దేశాలు మిత్ర దేశాలుగా ఉన్నాయి. అయితే నేటికీ అదే స్నేహభావాన్ని రెండు దేశాలు పాటిస్తున్నాయి. తాజాగా ఆప్ఘన్ తో మనకు ఉన్న బంధాన్ని తెలిపేలా అక్కడి పార్లమెంట్ ఆవరణలొ గ్రీన్ ఫౌంటేన్ ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ఫౌంటేన్ గ్రీన్ మార్బల్స్ తో తయారుకావడమే కాకుండా అందానికి నిలయంగా మారనుంది. అయితే ఉదయ్ పూర్ నేచురల్ హ్యాండీ క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫౌంటేన్ ను ఏర్పాటు చేసే టెండర్ ను దక్కించుకుంది.  దాదాపు 24 మంది కళాకారులు పగలు రాత్రి తేడా లేకుండా ఈ గ్రీన్ ఫౌంటేన్ ను తయారు చేశారు. దీన్ని ఈజీగా రవాణా చెయ్యడంతో పాటుగా, అద్భుతంగా రూపుదిద్దుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan green marbles  green marble fountain  Afghan Parliament  Kabul  Udaipur  

Other Articles