YSRCP may put no confidence motion in AP assembly

Ysrcp may put no confidence motion in ap assembly

YSRCP, YS Jagan, Jagan, AP, Assembly, Noconfidence motion, Kodela Shivaprasad

YSRCP may put no confidence motion in AP assembly. YSRCP Party anger on speaker behaviour. They may put no confidence motion

ఏపి స్పీకర్ పై అవిశ్వాసం..?!

Posted: 12/21/2015 10:26 AM IST
Ysrcp may put no confidence motion in ap assembly

ఏపి అసెంబ్లీ ఏకపక్షంగా సాగుతోంది. అధికార పక్షానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. స్పీకర్ పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారని ప్రతిపక్షం బావిస్తోంది. కాల్ మనీ మీద చర్చకు తీర్మానం ఇచ్చినా కానీ స్పీకర్ ఆ తీర్మానాన్ని రెండు సార్లు తిరస్కరించారు. అలాగే ప్రతిపక్ష నాయకులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కావాలనే వ్యవహరిస్తున్నారని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే స్పీకర్ కోడెల శివస్రసాద్ పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టున్నట్లు తెలుస్తోంది. కాల్ మనీ వ్యవహారం, రోజా మీద సస్పెన్షన్ వేటు ఇలా అనేక విషయాల మీద స్పీకర్ అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడుతున్నారు.

అసెంబ్లీ ప్రారంభమైన మొదటిరోజు నుండి రాష్ట్రంలో సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారం మీద చర్చకు సభలో అనుమతినివ్వాలని ప్రతిపక్ష పార్టీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. స్పీకర్ దాన్ని తిరస్కరిచారు. ఇలా రెండు సార్లు స్పీకర్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం మీద జగన్ గుర్రుగా ఉన్నారు. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యే రోజా మీద ఏకంగా ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వెయ్యడం మీద కూడా వారు ఆగ్రహంగా ఉన్నారు. మామూలుగా అయితే ఓ సెషన్ నుండి సస్పెన్షన్ వేటు వేస్తారే తప్ప. ఏడాదిపాటు వేటు వెయ్యడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా స్పీకర్ తీరుపై విసిగిన ప్రతిపక్షం స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. దీని మీద చర్చించడానికి వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ అత్యవసరంగా సమావేశం నిర్వహిస్తున్నారు. రేపు స్పీకర్ అవిశ్వాసం మీద నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  YS Jagan  Jagan  AP  Assembly  Noconfidence motion  Kodela Shivaprasad  

Other Articles